దేశంలో మార్చి నెల నుంచి కరోనా ప్రబలిపోతుందని లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం. ఇక లాక్ డౌన్ కారణంగా ఎవరూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దాంతో అన్ని వ్యవస్థలు మూతపడ్డాయి. కేవలం అత్యవసర వ్యవస్థలు మాత్రమే కొనసాగాయి. పండ్లు, కూరగాయలు, పాలు, మెడికల్ షాపులు మాత్రమే తెరుచుకున్నాయి. దాంతో ఎవరికీ పనులు లేక ఇంటి పట్టునే ఉండిపోయారు. ఆదాయం లేని కారణంగా ఎంతో మంది అద్దెకు ఉంటున్నవారి పరిస్థితి దయనీయంగా మారిపోయింది.  కొంత మంది ఇంటి యజమానులు మంచి మనసు చేసుకొని కిరాయిలు రద్దు చేశారు.. సగం తీసుకున్నారు. అయితే కొన్ని రాష్ట్రాలు మూడు నెలల వరకు అద్దె చెల్లించవద్దని.. ఆ తర్వాత కొద్ది మొత్తంలో చెల్లించవొచ్చని.. దీన్ని అతిక్రమిస్తే ఇంటి యజమానులపై కేసు పెడతామని హెచ్చరికలు జారీ చేశాయి.

 

అయినా కూడా కొందరు యజమానులు అద్దెల కోసం కిరాయిదారులను వేధిస్తున్నారు. దీంతో దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా అద్దె కోసం వేధించిన ఇంటి యజమానిని కిరాయిదారు కొడుకు అత్యంత దారుణంగా చంపిన ఘటన చెన్నైలో జరిగింది. నగరంలోని కుండ్రటూరులో ధనరాజ్ అనే వ్యక్తి గుణశేఖర్ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు.  గత నాలుగు నెలలుగా ఎలాంటి ఉపాది లేకుండా ఇల్లు గడవడమే కష్టంగా మారింది. దాంతో నాలుగు నెలలుగా అద్దె ఇవ్వడం లేదు. మరోవైపు  అద్దె కోసం గుణశేఖర్.. ధనరాజ్ మీద పదేపదే ఒత్తిడి తీసుకొస్తున్నాడు.

 

ధనరాజ్ తో ఘర్షణకు దిగాడు. అద్దె చెల్లించలేని పరిస్థితి ఉంటే.. తన ఇంటి నుంచి వెళ్లిపోవాలని.. దానికి తగ్గ డబ్బులు ఇచ్చిపోవాలని నానా మాటలు అంటూ గొడవకు దిగాడు.  అద్దె కోసం తన తండ్రిని వేధించడం చూసి ధనరాజ్ తనయుడు అజిత్ ఆవేశానికి లోనయ్యాడు.. కోపంతో ఇంటి యజమానిపై కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. దీంతో పోలీసులు అజిత్ ను అరెస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: