ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 1,26,25,000 మందికి కరోనా సోకింది. ఇప్పటివరకు 5,62,820 మంది ప్రాణాలు కోల్పోగా, కోలుకున్న వారి సంఖ్య 73,61,659 ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో ప్రతి రోజు రికార్డు స్థాయిలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకీ పెరిగిపోతుంది.  దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 27,114 మందికి కొత్తగా కరోనా సోకింది.

ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 519 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.  కరోనా మహమ్మారి భద్రతా దళాలపై తన పంజా విసురుతుంది. బీఎస్ఎఫ్‌లో ఇప్పటికే 1500 మందికిపైగా జవాన్లు కరోనా బారినపడగా, తాజాగా మరో 73 మందికి ఈ మహమ్మారి వైరస్ సోకింది. దీంతో బీఎస్ఎఫ్‌లో మొత్తం బాధితుల సంఖ్య 1,659కి పెరిగింది.

తాజాగా, 14 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఈ వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 927కు పెరిగింది. ఈ మద్య 14 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఈ వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 927కు పెరిగింది. మరోవైపు, ఇండో టిబెటిన్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)లోనూ కొత్తగా 12 మందికి వైరస్ సోకగా, 12 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఫోర్స్‌లో ఇంకా 178 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 298 మంది కోలుకున్నట్టు ఐటీబీపీ వర్గాలు తెలిపాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: