మార్చి నెల తొలి వారం నుంచి దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. మొదట్లో తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కాగా రానురాను కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో మొదట్లో విదేశాల నుంచి ప్రవాస భారతీయుల వల్ల కరోనా కేసులు నమోదయ్యాయి. అనంతరం తబ్లీజీల వల్ల దేశంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. 
 
తబ్లీజీలను ఎందుకు నిందించాల్సి వస్తోందంటే ఢిల్లీలో సమావేశాలు జరగక మునుపే కేంద్రం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కొన్ని నియమనిబంధనలను అమలులోకి తెచ్చింది. మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని అప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచించింది. అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా వేల మంది మత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అయితే విదేశాల నుంచి వందల సంఖ్యలో వచ్చిన తబ్లీజీల వల్ల వైరస్ ఇతరులకు సోకింది. 
 
విదేశాల నుంచి వచ్చిన వాళ్లంతా విజిటింగ్ వీసాలపై భారత్ కు వచ్చి సమావేశాలకు హాజరయ్యారు. సమావేశాల అనంతరం రోజుల తరబడి వాళ్లు వివిధ ప్రాంతాల్లో సంచరించడం వల్ల వైరస్ ఇతరులకు సోకింది. అనంతరం వలస కార్మికులు కరోనా కేసులు పెరగడానికి కారణమయ్యారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 
 
అయితే ఢిల్లీ హైకోర్టు 62 మంది మలేషియన్లు, 11 మంది సౌదీ అరేబియన్లను విడుదల చేసింది. ఢిల్లీ హైకోర్టు వీళ్లకు కేవలం 7,000 రూపాయల నుంచి 11,000 రూపాయల ఫైన్ విధించి విడుదల చేయడం గమనార్హం. అయితే హైకోర్టు తీర్పుపై సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. వైరస్ వ్యాపించటానికి కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే కోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడానికి అసలు కారణాలు తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: