రాజకీయాల్లో ఏ నేతకైనా అధికారమే ముఖ్యం. అధికారం దక్కించుకోవడానికి నేతలు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాకపోతే, వచ్చినా పార్టీలోకి జంప్ అయిపోతారు. గతంలో టీడీపీ అధికారంలో ఉంటే వైఎస్సార్‌సీపీ నేతలు అందులోకి వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలు ఇటు వచ్చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ లోకి వచ్చారు. అలాగే ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పదవులు పోకుండా వైఎస్సార్‌సీపీకి మద్ధతు తెలిపారు.

 

అయితే మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా జగన్‌కు మద్ధతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌లు టీడీపీని వీడబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే వార్తలు వచ్చే సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు పెద్దగా పార్టీ మార్పు వ్యవహారంలో స్పందించలేదు.

 

కానీ కొన్ని రోజులుపోయాక ఇద్దరు నేతలు ఒకరి తర్వాత ఒకరు బయటకొచ్చి, టీడీపీని వీడే ప్రసక్తే లేదని చెప్పారు. తాము చంద్రబాబుతోనే ఉంటామని చెప్పారు. అయితే వారు స్ట్రాంగ్‌గా పార్టీ మారమని చెప్పినా కూడా, తెలుగు తమ్ముళ్ళుకు మాత్రం అనుమానం అలాగే ఉంది. వీరు ఎప్పుడో బాబుకు షాక్ ఇచ్చేస్తారేమో అని చర్చలు చేసుకుంటున్నారు. వీరి చర్చలు ఎలా ఉన్నా, ఈ ఇద్దరు నేతలు ఈ మధ్య చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఎక్కడకి వెళ్ళిన ఇద్దరు కలిసే వెళుతున్నారు. 

 

అసలు రాజ్యసభ ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి రాని, అనగాని ఇప్పుడు బాగానే తిరుగుతున్నారు. తాజాగా ఈ ఇద్దరు నేతలు కలిసి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఫ్యామిలీని పరామర్శించేందుకు వెళ్లారు. అలాగే తిరుపతికి కూడా ఇద్దరు కలిసే వెళ్లారు. అయితే ఇలా కలిసి తిరగడంలో ఏమన్నా ప్లాన్ ఉందా? అని తమ్ముళ్ళు అనుమానిస్తున్నారు. మొత్తానికి వీరిద్దరి కాంబినేషన్ టీడీపీకి దెబ్బ వేసేలా ఉంది అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: