ఎల్ఐసీలో పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకోసం అదిరిపోయే స్కీం అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీంను ఎల్ఐసీ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. భారత దేశ దిగ్గజ బీమా కంపెనీ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ (ఎల్ఐసీ) ఇప్పటి వరకు ఎన్నో రకాల పాలసీలను అందుబాటులో తీసుకువచ్చింది. ఎండోమెంట్ ప్లాన్, టర్మ్ ప్లాన్, మనీ బ్యాక్ ప్లాన్, చిల్డ్రన్స్ ప్లాన్, యాన్యుటీ ప్లాన్లంటూ చాలా రకాల ఆఫర్లను వినియోగదారుల ముందుంచింది.

 


60 ఏళ్ల వయస్సు దాటిన వారికి ప్రతి నెలా పెన్షన్ పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తరఫున ఎల్ఐసీ వయ వందన యోజన పథకాన్ని ప్రారంభించింది. కస్లమర్లు ఇన్వెస్ట్ చేసే మొత్తం రూపాయల ఆధారంగా పెన్షన్ మారుతుందని, ఈ పథకం 2023 మార్చి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎల్ఐసీ పేర్కొంది.

 

 

ఈ పథకంలో సీనియర్ సిటిజన్లకు మాత్రమే చేరడానికి వీలుంటుందని, ఈ స్కీం పదేళ్ల వరకు కొనసాగుతుందని, అప్పటి వరకు పథకానికి సంబంధించిన అన్ని ప్రయోజనాలు పొందుతారని ఎల్ఐసీ స్పష్టం చేసింది. వయ వందన మోజన పథకంలో చేరినట్లయితే 7.4 శాతం వడ్డీ రేటు పొందుతారని, ఇప్పటివరకు 6.28 లక్షల మంది ఈ పథకంలో భాగస్వాములయ్యారని తెలిపారు.

 


ఈ పథకంలో చేరిన కస్టమర్లకు నెలకు రూ.1000 నుంచి రూ.9250 వరకు పెన్షన్ పొందే సదుపాయం ఉంది. నెలకే పరిమితం కాకుండా మూడు, ఆరు, ఏడాది చొప్పున పెన్షన్ పొందవచ్చు. కస్లమర్లు రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే రూ.9250 పెన్షన్ వస్తుందని, రూ.1.5 లక్షలు కడితే రూ.1000 వరకు పెన్షన్ పొందవచ్చన్నారు.

 

 

ఈ పథకంలో చేరిన వినిమోగదారులకు అత్యవసర పరిస్థితుల్లో ఆదుకోవడానికి ఎల్ఐసీ లోన్ సదుపాయానికి అందించిందని, ప్రజలు భాగస్వాములై పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. స్కీంలో చేరిన కస్టమర్లకు మోసపోకుండా మోదీ సర్కారు హామీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: