ఇది ఒక విధంగా చెప్పాలంటే  నిరుద్యోగులకు శుభవార్త అన్న మాట. తాజగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) క్యాంపస్ నియామకాల సమయంలో 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే అవకాశం ఉందని వెల్లడించింది.టాటా కన్సల్టెన్సీ  సంస్థ ప్రతినిధుల చెప్పిన  నివేదికల ప్రకారం గత త్రైమాసికంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న  కారణం  చేత కంపెనీ ఆదాయం చాలా తగ్గింది. కానీ  టీసీఎస్‌ సంస్థ  మాత్రం తన నియామకాలను తగ్గించుకోదని తెలిసింది. మళ్ళీ కొత్తగా క్యాంపస్ సెలక్షన్ ద్వారా నిరుద్యోగులకు జాబ్ ఆఫర్ చేస్తే  మళ్ళీ వచ్చే ఏడాది తిరిగి వ్యాపారం మెరుగు పడుతుందని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.

 

 

 

 

అయితే ఈ టిసిఎస్ కంపెనీ గత సంవత్సరం  కూడా  మన  భారత క్యాంపస్‌ల నుంచి 40 వేల మంది ఫ్రెషర్లను నియమించుకుంది.అమెరికాలో  కూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ పెంచాలని కంపెనీ నిర్ణయించింది. హెచ్ 1బీ, ఎల్1 వీసాలపై ఆంక్షలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా టీసీఎస్‌ ఈవీపీ, గ్లోబల్‌ హెచ్‌ఆర్‌ హెడ్‌ మిలింద్‌ లక్కడ్‌ మాట్లాడుతూ యూఎస్‌లో వీసాలపై ఆంక్షలు సరిగా లేవన్నారు.

 

 

 

అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ పరిపాలన బాధ్యతలు స్వీకరించిన తరువాత యూఎస్‌లో పని చేయడానికి ఇతర దేశాల నుంచి ఉద్యోగులను నియమించుకునే విషయంలో యజమానులు నిరుత్సాహ పడే విధంగా హెచ్ 1బీ వీసాలపై అలాగే  విద్యార్థి వీసాలపై కూడా  అనేక ఆంక్షలు విధించినట్లు ఆయన తెలిపారు.ఒక్క ఇంజనీర్లనే మాత్రమే కాకుండా  అమెరికాలోని బిజినెస్ స్కూళ్ల నుంచి కూడా సిబ్బందిని తీసుకుంటుంది. ఇంకా ఆశ్చర్యపోవాలిసిన విషయం ఏంటంటే  2014 నుంచి ఈ సంస్థ 20 వేల మంది అమెరికన్లను తన కంపనీలో  నియమించుకుంది.మళ్ళీ ఈసారి కూడా 40000 మందికి ఉపాధి కలిగించే ఆలోచనలో ఉండడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: