దేశంలో కరోనా వైరస్ ప్రభావం బీభత్సం సృష్టిస్తుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 9,06,752కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 23,727కి పెరిగింది. 3,11,565 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 5,71,460 మంది కోలుకున్నారు.  మార్చి నెల నుంచి కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అన్ని వ్యవస్థలు మూసివేసిన విషయం తెలిసిందే. దాంతో వివాహాది శుభకార్యాలు కొన్ని వాయిదా పడ్డాయి.. మరికొన్ని సీక్రెట్ గా చేసుకున్నా.. పోలీసు కేసులు అయ్యాయి. ఇటీవల లాక్ డౌన్ సడలింపు చేసినప్పటి నుంచి 50 మంది వరకు దగ్గరి బంధువులతో శుభకార్యాలు చేసుకోవొచ్చు అని కేంద్రం ప్రకటించింది.

 

అది కూడా పూర్తిగా శానిటైజర్, మాస్కులు ధరించి.. సోషల్ డిస్టెన్స్ మెయింటేన్ చేస్తూ ఉండాలని చెప్పింది.  ఇలా నిబంధనలు ప్రకారం కొంత మంది.. రూల్స్ బ్రేక్ చేస్తూ కొంతమంది శుభకార్యాలు జరుపుకుంటున్నారు. తాజాగా పంజాబ్‌లో పెరుగుతున్న కొరోనా వైరస్ కేసులను దృష్టిలో ఉంచుకుని, అక్క‌డి అమరీందర్ సింగ్ ప్రభుత్వం రాష్ట్రంలో బహిరంగ సభల‌ను పూర్తిగా నిషేధించింది. అలాగే సామూహిక కార్య‌క్ర‌మాల‌కు ఐదుగురు, పెళ్లిళ్ల‌కు 30 మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యేందుకు అనుమ‌తినిచ్చారు.   గతంలో వివాహాల‌కు 50 మంది వ‌ర‌కూ హాజ‌ర‌య్యేందుకు అనుమ‌తి ఉండేది.

 

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో 30 మంది మాత్రమే హాజరు కావాలని నిబంధనలు పెట్టింది.  ఈ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు న‌మోదు చేయ‌నున్నారు. పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న‌దాని ప్ర‌కారం ఎవ‌రైనాస‌రే సామాజిక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించే ముందు పోలీసులు, ప‌రిపాల‌నాధికారుల‌ను త‌ప్ప‌నిస‌రిగా సంప్ర‌దించాల‌ని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: