ఏపీ సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చిన కొన్నిరోజులకే రాజధాని మారుస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. మొదట్లో కొన్నాళ్లు దీనిపై నోరు మెదపని జగన్.. ఆ తర్వాత తన ఉద్దేశ్యాన్ని అసెంబ్లీ వేదికగానే బయటపెట్టేశారు. ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని నిండు అసెంబ్లీలోనే ప్రకటించేశారు. 

 

చంద్రబాబు ఏర్పాటు చేసిన అమరావతిని కాదని.. జగన్ రాజధానిని విశాఖకు మార్చాలని నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం అమలులో టీడీపీ వ్యూహం కారణంగా జాప్యం జరుగుతోంది. అయితే జగన్ ఇలా రాజధాని మార్చడం వెనుక పకడ్బందీ వ్యూహం ఉందంటున్నారు వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు. 

 

IHG


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవడానికి కారణం ఆ ప్రాంతం వెనుకబాటే. ఇప్పుడు అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే మళ్లీ పదేళ్ల తర్వాతైనా మరో ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ వచ్చే ప్రమాదం ఉందని వైసీపీ మంత్రి చెబుతున్నారు. పదేళ్ల తర్వాత మళ్లీ ఏర్పాటు ఉద్యమాలు రాకూదని సీఎం వైయ‌స్ జగన్‌ మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనుకుంటున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. 

 

IHG


ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందంటున్న మంత్రి అవంతి శ్రీనివాస్... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గతంలో చంద్రబాబు కొన్ని వర్గాలను మాత్రమే చూసి మేలు‌ చేశారని.. జగన్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రభుత్వమని తెలిపారు. వివక్ష, అవినీతి లేకుండా జగన్ సంక్షేమ పాలన చేస్తున్నారని మంత్రి అవంతి చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: