కరోనాకు గాంధీలో మంచి వైద్యం జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. గాంధీలో వైద్యంపై దుష్ప్రచారం నమ్మవద్దని మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ తరచూ చెబుతుంటారు. కానీ.. గాంధీ ఆసుపత్రిలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెంది ఎనిమిది గంటలైనా వార్డు నుంచి ఎవరూ మార్చురీకి తీసుకెళ్లని ఘటన తోటి రోగులను ఆందోళనకు గురి చేసింది. 

 

IHG

 


కరోనా రోగి చనిపోయి 8 గంటలవుతున్నా.. ఎవరూ పట్టించుకోలేదని.. మార్చురీకి తీసుకెళ్లలేదని తోటి రోగులు చెబుతున్నారు. వారిలో ఒకరు ఈ దృశ్యాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం బయటకు వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆ రోగి కరోనాతో మరణించాడు. ఈ ఘ‍టన నిజమేనని గాంధీ అధికారవర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. 

 

IHG


అయితే.. అయిదు రోజులుగా పొరుగు సేవల నర్సులు ఆందోళన చేస్తున్నారాని వారు చెబుతున్నారు. దీనికి తోడు ఔట్ సోర్సింగ్ సిబ్బందితో కలసి ఆసుపత్రిలోని ఇతర పొరుగు సేవల సిబ్బంది కూడా మంగళవారం ఆందోళనకు దిగారు. దీంతో విధులు నిర్వహించే వారే లేకుండా పోయారు. ఉన్న కాస్త పర్మినెంట్ సిబ్బంది ఐసీయూలకే పరిమితం అయ్యారు. 

 

అందువల్లే  ఓ రోగి చనిపోయినా ఆ మృతదేహాన్ని మార్చురీకి తరలించలేకపోయామని గాంధీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మృతదేహం కుళ్లిపోయిందని.. దుర్వాసన వచ్చిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని గాంధీ వర్గాలు చెబుతున్నాయి. ఈసీజీ, ఇతర డాక్యుమెంటేషన్‌ చేసే సిబ్బంది కూడా మూకుమ్మడిగా విధులు బహిష్కరించారని అందువల్లే మృతదేహాన్ని మార్చురీకి తరలించడంలో ఆలస్యం జరిగిందని వివరణ ఇచ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: