కరోనా మహమ్మారి నుంచి బయటపడేసేందుకు ఇంకా వ్యాక్సీన్ అందుబాటులోకి రాలేదు. ఇప్పుడే వస్తుందన్న నమ్మకమూ లేదు. కనీసం నాలుగైదు నెలలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి అప్పటి వరకూ కరోనా రోగులను కాపాడేదెలా.. కొన్ని ఇంజక్షన్లు, టాబ్లెట్లు మార్కెట్లోకి వచ్చినా వాటి ప్రభావం.. కొంతమేరకే.. స్వల్ప లక్షణాలు ఉన్నవారినే అవి కాపాడగలుగుతాయి. 

 

IHG


మరి కరోనా తీవ్రంగా ఉన్నవారిని ఎలా బతికించుకోవాలి.. ఇందుకు ఉన్న ఒకే ఒక్క మార్గం ప్లాస్మా చికిత్స. ఇప్పుడు ఇదొక్కటే కరోనా రోగులను కాపాడుతుంది.  మరి ఈ ప్లాస్మా చికిత్స అంటే ఏంటి.. అంటే ఒక విధంగా ముల్లును ముల్లుతోనే తీయడం అన్నమాట. కరోనా ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్నవారి రక్తంలోని ప్లాస్మా ద్రవాన్ని జబ్బుతో బాధపడుతున్నవారికి ఎక్కించడమే ప్లాస్మా థెరపీ అన్నమాట. 

 

IHG


మన రక్తంలో ప్లాస్మా ద్రవంతో పాటు ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ప్లేట్‌లెట్లు ఉంటాయి.  వాటి నుంచి ప్లాస్మాను మాత్రం వేరు చేస్తారు. ఒకో దాత నుంచి 400 ఎం.ఎల్‌. ప్లాస్మాను స్వీకరిస్తారు. ఒక దాత నుంచి తీసుకున్న ప్లాస్మా ఒక కరోనా రోగికి సరిపోతుంది. 

 

IHG


ఇప్పటికే ఈ  ప్లాస్మా థెరపీ కి భారత వైద్య పరిశోధన మండలి.. ఐసీఎంఆప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతే కాదు.. ఈ విధానంలో ఇప్పటి వరకూ కొందరిని కాపాడారు కూడా. మరణం అంచుల వరకూ వెళ్లిన ఢిల్లీ  ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ ను ఈ చికిత్స ద్వారానే కాపాడగలిగారు. అందుకే ఇప్పుడు ఢిల్లీలో ఏకంగా ప్లాస్మా బ్యాంకునే ఏర్పాటు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: