ఈ మద్య సోషల్ మీడియా పుణ్యమా అని ప్రకృతిలో జరిగే చిత్ర విచిత్రాలు మనం చూడగలుగుతున్నాం.  ప్రపంచంలో జరిగే అరుదైన దృశ్యాలను ఎంతో మంది ఔత్సాహికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.  జంతువు, పక్షులు.. మనుషులు చేసే చిత్ర విచిత్ర విన్యాసాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సాధారణంగా రామచిలుకలు ముద్దు ముద్దుగా మాట్లాడుతాయి... అందుకే చిలకపలుకులు అంటారు.  ఇది ఎంత వరకు నిజమో అబద్దమో కానీ.. ఓ చిలుక మాత్రం అలారం ట్యూన్ వినగానే భలే డ్యాన్స్ చేస్తుంది.

 

అదీ కూడా ఒక్కో రకం అలారం ట్యూన్ కి ఒక్కో రకంగా డ్యాన్స్ చేస్తూ అబ్బుర పరుస్తుంది. 42 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను అమెరిక‌న్ మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మ‌న్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు.'వేర్వేరు అలారం రింగ్‌టోన్‌లకు ర‌క‌ర‌కాలుగా నృత్యాలు చేస్తున్న ఈ పక్షి ఖచ్చితంగా అంద‌రినీ అల‌రిస్తుంది' అనే శీర్షికతో క్లిప్‌ను షేర్ చేశారు.  తాజాగా ఈ ముద్దుల చిలుక డ్యాన్స్ చూస్తూ అబ్బో ఇది మాకన్నా బాగా డ్యాన్స్ చేస్తుందే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: