- యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు

- సీమ సిటుక్కుమంటాంటే పుస్త‌కం

డిజిట‌ల్ పోస్ట‌ర్ పోస్ట్ చేస్తూ ట్వీట్

 

సాహిత్యం భౌగోళిక స‌రిహ‌ద్దులు చెరిపేస్తుందని, ఉత్త‌మ సాహిత్యానికి ప్ర‌తీక‌గా రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి రచించిన "సీమ సిటుక్కు మంటాంటే" పుస్త‌కం పేరొందాల‌ని యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు ఆకాంక్షిస్తూ, పుస్త‌కానికి సంబంధించి ప్ర‌త్యేకంగా రూపొందించిన పోస్ట‌ర్ ఫ్రేమ్స్ ను ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నేమ‌న్నారంటే.."రాయ‌ల‌సీమ కేంద్రంగా సాహిత్యం వెలువ‌రిస్తున్న యువ ర‌చ‌యిత, రాళ్ల‌ప‌ల్లి వారింటి బిడ్డ రాజావ‌లి. వారి ర‌చ‌న‌ల‌ను సంక్షిప్త రూపంలో సీమ సిటుక్కుమంటాంటే అనే శీర్షిక‌తో పుస్త‌క రూపంలో ప్ర‌చురిస్తున్న ఆర్.కిశోర్ క్రియెటివ్స్ సార‌థి ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతికి, అలానే ర‌చ‌యిత‌కూ ఇవే నా అభినందన‌లు. 

 

మాండ‌లిక ప్ర‌ధాన సాహిత్యం మ‌రింత విస్తృతం చెందాలన్న స‌త్-సంకల్పంతో, కొత్తత‌రం గొంతుక‌లు వినిపించాల‌న్న దృక్ప‌థంతో చేస్తున్న ఈ ప్ర‌య‌త్నం, ఈ ప‌ద బంధం అంద‌రికీ చేరువకావాల‌ని ఆశిస్తున్నా. ఓ యువ ఎంపీగా ఇదే నా ఆకాంక్ష‌..భౌగోళిక స‌రిహ‌ద్దుల‌ను చెరిపేసే గొప్ప శ‌క్తి క‌ళ‌కూ, ముఖ్యంగా సాహిత్య, సాంస్కృతిక రూపాలకూ ఉంద‌న్న‌ది నా విశ్వాసం. మా శ్రీ‌కాకుళం ర‌చ‌యిత, క‌వి ర‌త్న‌కిశోర్ శంభుమహంతి చేస్తున్న ఈ చిన్న ప్రయ‌త్నం విజయం సాధించాల‌ని ఆశిస్తూ..టీం శంభుమహంతికి ఇవే నా శుభాకాంక్ష‌లు. ఆ సీమబిడ్డ‌కూ, డిజిట‌ల్ పోస్ట‌ర్స్ రూపక‌ర్త గిరిధ‌ర్ అరస‌వ‌ల్లికీ, లే-ఔట్ ఆర్టిస్టులు మ‌హి బెజ‌వాడకూ‌, ఝాన్సీ న‌ల్ల‌మెల్లికీ అభినంద‌న‌లు. ఆల్ ద బెస్ట్ టూ ఆల్.." అంటూ త‌న ఆకాంక్ష‌ను వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: