ఏపీలో కరోనా మరణాలు అకస్మాత్తుగా పెరిగిపోతున్నాయి. కొన్ని రోజులుగా.. కరోనా మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. కరోనా వచ్చిన మొదట్లో రోజుకు మూడో, నాలుగో మరణాలు ఉండేవి.. ఆ తర్వాత క్రమంగా మరణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మరీ నాలుగైదు రోజులుగా ఈ కరోనా మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. 

 


తాజాగా గత 24 గంటల్లోనే ఏకంగా 44 మంది మరణించారు. అత్యధికంగా అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 9 మంది చొప్పున మరణించారు. కర్నూలులో 5, చిత్తూరు, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో నలుగురేసి, కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. 

 

IHG
నిన్న కూడా.. ఏకంగా 43 మంది కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కన్నుమూశారు. అంటే గత రెండురోజుల్లో భారీ సంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి. మొన్నటికి మొన్న కూడా 37 మంది కన్నుమూశారు.. అంతకుముందు రోజు 19 మంది.. దాని కంటే ముందు రోజు 17  మంది కరోనా మహమ్మారి పంజాకు బలయ్యారు. అంటే కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే 160మంది కరోనా కాటుకు బలయ్యారన్నమాట. 

 

 

IHG

 


ఈనెల 10న 292గా ఉన్న మృతుల సంఖ్య... కేవలం ఐదు రోజుల్లోనే 452కు ఎగబాకింది. అంటే కరోనా మరణాల జోరు బాగా పెరిగిందన్నమాట. మరో విషయం ఏంటంటే.. తెలంగాణతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్యలో ఏపీ తక్కువగానే ఉన్నా మరణాల సంఖ్యలో మాత్రం తెలంగాణను దాటేసింది. మరి ఈ మరణాలు ఎందుకు పెరుగుతున్నాయి? కట్టడికి ఏం చేయాలన్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు ముమ్మరం చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: