తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 1597 పాజిటివ్ కేసులు నమోదుకాగా 11మంది కరోనాతో మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈకొత్త కేసుల్లో అత్యధికంగా జిహెచ్ఎంసిలో 796, రంగారెడ్డిలో 212,మేడ్చల్ లో115 సంగారెడ్డి లో 73 కేసులు నమోదుకాగా వీటితోపాటు మిగితా జిల్లాల్లో కూడా భారీగా కేసులు నమోదయ్యాయి అందులో భాగంగా నల్గొండలో 58, వరంగల్ అర్బన్ లో 44, కరీంనగర్ 41 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
 
ఇక ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 39342 కరోనా కేసులు నమోదవ్వగా అందులో 25999మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 12958 కేసులు యాక్టీవ్ గా ఉండగా కరోనా మరణాల సంఖ్య 386కు చేరింది. ఈరోజు రికార్డు స్థాయిలో మొత్తం 13642 శాంపిల్ టెస్టులు జరిగాయి. 
 
ఇక దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈఒక్క రోజే దేశంలో రికార్డు స్థాయిలో 30000కు పైగా కేసులు నమోదయ్యాయని సమాచారం. అందులో అత్యధికంగా మహారాష్ట్రలో 7975, తమిళనాడులో 4496 ,కర్ణాటకలో 3176 కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా ఇప్పటివరకు ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 960000 దాటగా 24000 కరోనా మరణాలు సంభవించాయి. ఇక ఇప్పటివరకు 600000మంది బాధితులు కరోనా నుండి కోలుకోవడం ఒక్కటే ఊరటనిచ్చే విషయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: