కరోనా బారిన పడి యువకులు కూడా ప్రాణాలు వదులుతుంటే ముంబై కు చెందిన 101ఏళ్ళ వృద్ధుడు అజోబా మాత్రం కరోనాను జయించి ఆశ్చర్యపరిచాడు. కొన్నిరోజుల క్రితం కరోనా సోకిందని అజోబా, ముంబైలోని బాలాసాహెబ్ థాక్రే ట్రామా కేర్ ఆసుపత్రిలో చేరగా నిన్నటితో పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్  అయ్యి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక ఇంటికి వెళ్లే ముందు అజోబాతో ఆసుపత్రి సిబ్బంది కేక్ కట్ చేయించారు. ఈ కేక్ కట్ చేయించిన వీడియో ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. 
ఇదిలావుంటే మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజు రోజుకి కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. నిన్న ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 7975 కేసులు నమోదుకాగా 233మంది కరోనాతో మరణించారు. ఈకేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 275640కు చేరగా ఇప్పటివరకు కరోనాతో 10928 మంది బాధితులు మరణించారు.
 
ప్రస్తుతం దేశంలో అత్యధిక కరోనా కేసులతో పాటు మరణాలు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఇక ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 960000కు పైగా కరోనా కేసులు నమోదుకాగా 24000మంది బాధితులు కరోనాతో మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: