జీవితంలో అదృష్టం అనేది ఎవరిని ఏ విధంగా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. అదృష్టం, దురదృష్టం వల్లే కొన్ని సందర్భాల్లో ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయి. కొన్ని సందర్భాల్లో ఆ అదృష్టమే మనల్ని కోటీశ్వరులను చేస్తుంది. తాజాగా మన దేశం అల్లం టీ ఒక మహిళను కోటీశ్వరురాలిని చేసింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజంగానే ఇది జరిగింది. సాధారణంగా ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి ఒక దేశానికి మరో దేశానికి ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. 
 
ఒక ప్రాంతానికి చెందిన ఆహార పదార్థాలు మరో ప్రాంతంలో ఆదాయాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. ఆంధ్రాలో సాధారణంగా ఇడ్లీ, దోశ, పూరీ, వడలను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటాం. తెలంగాణలో ఆహారపు అలవాట్లు ఏపీకి పూర్తి భిన్నంగా ఉంటాయి. ఉత్తర భారతానికి చెందిన పానీపూరీ, భేల్ పూరీ ప్రస్తుతం మన జీవితంలో భాగం అయిపోయాయి. విదేశాలకు చెందిన్ పిజ్జాలు, బర్గర్లకు దేశంలో రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. 
 
మరి మన దేశానికి చెందిన వంటకాలకు విదేశాల్లో డిమాండ్ ఉందా....? అనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానాలు వినిపిస్తున్నాయి. బ్రూక్ ఎడ్డీ  అమెరికాలోని కొలరాడోకు చెందిన మహిళ . సాత్వాయ్ పరివార్ అనే కార్యక్రమం కోసం భారత్ లోని మహారాష్ట్రకు వచ్చింది. అక్కడ ఆమె ఎక్కువగా అక్కడివాళ్లు ఇచ్చిన అల్లం టీని సేవించేది. అమెరికాకు వెళ్లిన తరువాత చాలా చోట్ల టీ తాగినా ఆమెకు భారత్ లోని టీ రుచి మాత్రం మరవలేకపోయింది. 
 
దీంతో అల్లం టీనే బిజినెస్ గా ప్రారంభించాలని ఆమె సంకల్పించింది. అల్లం టీ కోసం అవసరమయ్యే పదార్థాలతో టీ తయారు చేసి ఎక్కువ సంఖ్యలో జనం ఉన్న ప్రాంతంలో ఆ టీని అమ్మడం ప్రారంభించింది. రోజురోజుకు ఆమె టీకి గిరాకీ పెరిగింది. అనంతరం భక్తి ఛాయ్ పేరుతో దుకాణం తెరిచి ఆమె టీని విక్రయించింది. ఇప్పటివరకు ఆమె అల్లం టీ అమ్మి 227 కోట్ల రూపాయలు సంపాదించింది. ఆ సంపాదనలో 50 కోట్ల రూపాయలు భారత్ లో ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. భారత్ అల్లం టీ ద్వారా కోట్లు సంపాదించి మన దేశంలోనే ఖర్చు పెట్టాలని ఆమె తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: