రాష్ట్రం విడిపోయింది. అన్ని డిపార్ట్ మెంట్లు.. చివరకు ఆర్టీసీ విభజన కూడా పూర్తి కావస్తుంది. ఇక ఎవరి బతుకు వారిది.. ఎవరి దోవ వారిది అనుకుని ముందుకుసాగేందుకు అంతా మెంటల్ గా సిద్దమైపోతున్నారు. ఈ సమయంలో అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కాస్త ఆలస్యంగానైనా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. డీఎస్సీ అంటే బాబు.. బాబు అంటే డీఎస్సీ అనే పేరు ఇప్పటికే చంద్రబాబుకు ఉంది. ఐతే ఈ డీఎస్సీ నోటిఫికేషన్ అందిరికీ బాగానే ఉన్నా.. కొందరికి మాత్రం చిక్కులు తెచ్చిపెడుతోంది.  రాష్ట్రం విడిపోయింది కాబట్టి.. ఒక రాష్ట్రంవారికి మరొక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు రావు. మరి ఏ రాష్ట్రం వారు ఎవరో ఎలా డిసైడ్ చేస్తారు. ఇందుకు స్థానికత నిర్ధరించే సూత్రాలు ఉన్నాయి. నాలుగో తరగతి నుంచి పదో తరగతిలోపు వరుసగా ఎక్కడ నాలుగేళ్లు చదివితే ఆ అభ్యర్థి అక్కడి లోకల్ అవుతాడు. ఐతే.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చాలామంది ఉపాధి కోసం వలస రావడం వల్ల.. ఇక్కడే పుట్టి.. పెరిగిన లేదా.. ఇక్కడ చదువుకున్న వారు.. ఆంధ్రాలో నాన్ లోకల్ అవుతారు. వారు అక్కడి ఉద్యోగాలకు అనర్హులు.  ఇలాంటి వలస అభ్యర్థులు ఇప్పుడు తమకూ డీఎస్సీ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఆంధ్రా రాష్ట్రానికి చెందినవారమైన తమకు అవకాశం కల్పించడం అన్నివిధాలా న్యాయం అని వేడుకుంటున్నారు. వీరివాదనలో కాస్త న్యాయం ఉన్నా.. టెక్నికల్ గా వీరు తెలంగాణ లోకల్ కు చెందిన వారు కావడం ఇబ్బందికరమే. ఐతే.. విభజన కారణంగా తలెత్తిన ఇలాంటి సమస్యలు ఇక ముందు తలెత్తే అవకాశం ఉండదు కాబట్టి.. ఈసారికి తమకు ఛాన్స్ ఇవ్వాల్సిందేనని అడుగుతున్నారు. మరి మంత్రి గంటా వీరిపై దయచూపుతారా లేదా.. అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: