నోరుంది.. అధికారం ఉంది... ఇక మనల్ని అడిగెదెవరు..ఇలాగే ఉంది కొందరు తెలంగాణ మంత్రుల వ్యవహారం. తెలంగాణ విడిపోయి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా.. ఇంకా ఆంధ్రా నేతలను ఏదో ఒక రకంగా తిట్టడం మాత్రం వీరు మానుకోవడం లేదు. లేటెస్టుగా తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా కుక్కలంటూ దిగజారి మాట్లాడారు. 

తమ సమస్యలు పరిష్కారించాలంటూ బంద్ చేస్తున్న ఆశా కార్యకర్తలు వినతపత్రం ఇస్తున్న సమయంలో ఆయన ఒక్కసారిగా రెచ్చిపోయారు. కొందరు ఆంధ్ర కుక్కలు మిమ్మల్ని సపోర్టు చేసి ఆడిస్తున్నారు... వాస్తవానికి మీవి ప్రభుత్వ ఉద్యోగాలు కావు.. అలాంటప్పుడు ప్రభుత్వం మీ సమస్యలను ఎలా పట్టించుకుంటుంది.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్‌ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కోమల్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది. 

మంత్రి జగదీశ్వర్ రెడ్డి వ్యవహారశైలిపై.. ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలే మండిపడుతున్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డిని కంట్రోల్ లో పెట్టుకోవాలని లేకపోతే నష్టపోతారని.. కేసీఆర్ కు పొంగులేటి సూచించారు. 

మంత్రులే ఇలా అడ్డగోలుగా మాట్లాడితే ఇక ప్రభుత్వ పాలన సరిగ్గా ఎలా ఉంటుందని పొంగులేటి విమర్శించారు. మంత్రులు బాద్యత ఉండాలని... ఏదిపడితే అది మాట్లాడి.. ప్రతిపక్షాలను, ఉద్యోగులను భయపెట్టాలనుకోవడం సరికాదని సూచించారు. అభ్యంతర భాష వాడొద్దన్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంటున్నారు. ఆంధ్రా నేతలను బూచిగా చూపి ఎక్కువకాలం నెట్టుకురాలేమని ఇలాంటి నేతలు గమనించాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: