ఏపీ ఎన్నికల్లో గట్టెక్కడానికి చంద్రబాబు కేసీఆర్ జపం చేస్తున్నారు. తాను వెళ్లిన ప్రతి సభలోనూ కేసీఆర్‌ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.. ఏపీలో పరోక్ష పాలన సాగించాలని కేసీఆర్‌ అనుకుంటున్నారు. మనుషుల్ని కొని పెత్తనం చేయాలనుకుంటున్నారు.. అంటూ ఆరోపిస్తున్నారు. 

babu on kcr కోసం చిత్ర ఫలితం


జగన్‌కు రెండు వేల కోట్లు పంపి.. ఏపీకి రావాల్సిన లక్ష కోట్ల ఆస్తి ఎగవేద్దామనుకుంటున్నారు! దుష్టశక్తులన్నీ ఏకమై దాడి చేస్తున్నాయి. మనకు పౌరుషం లేదా! రాష్ట్రంపై దాడి చేస్తే ఊరుకుంటామా! అంటూ ఏపీ ఓటర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

సంబంధిత చిత్రం

ఏపీని హైదరాబాద్‌ నుంచి పాలిస్తే సహిస్తామా? ఆంధ్రాకు వస్తామని కేసీఆర్‌ అంటున్నారు. రావయ్యా రా... అటో ఇటో తేలిపోతుంది! అంటూ సవాళ్లు విసురుతున్నారు చంద్రబాబు. కానీ.. చంద్రబాబు అంతగా రెచ్చిపోతున్నా.. జనంలో ఆ స్పందన కనిపించడం లేదు. 

chandrababu angry కోసం చిత్ర ఫలితం


ఎప్పుడూ మోడీనో.. కేసీఆర్‌నో.. జగన్‌నో తిట్టడం కంటే.. తానేం చేశాడో చెప్పుకుంటే మేలని జనం ఫీలవుతున్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా సెంటిమెంట్ రాజేసి తెలంగాణ తరహాలో లాభపడదామని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం మాత్రం ఫలించడం లేదు.. కానీ ఈ విషయం అర్థమయ్యేసరికి పుణ్యకాలం గడిచిపోయేట్టుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: