ప్రభుత్వ అధికారులకూ.. రాజకీయ నాయకులకూ ఉన్న బంధం విచిత్రంగా ఉంటుంది. నాయకులు అధికారంలో ఉన్నప్పుడు అణిగిమణిగి అణుకువగా ఉండే కొందరు అధికారులు వారు అధికారంలో నుంచి దిగిపోగానే పెద్దగా లెక్కచేయరు.. అందుకేనేమో ఓ సినిమా.. బురదలో ఉన్న పందితోనూ.. రాజకీయ నాయకుడితోనూపెట్టుకోకు.. అంటూ రచయిత వ్యంగ్యోక్తి విసురుతాడు. 


ఇప్పుడు ఏపీలోనూ అదే జరగుతున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు ప్రస్తుతం అధికారాలు లేని ముఖ్యమంత్రి కావడంతో అధికారులు పెద్దగా లెక్కచేయడం లేదని తెలుస్తోంది. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తారో రారో తెలియదు. మరోవైపు ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ అధికారుల తీరుపై డేగ కన్ను వేస్తోంది. 

ఈ పరిస్థితుల్లో కొందరు అధికారులు చంద్రబాబు సమీక్షలకు డుమ్మా కొడుతున్నారట. ఆర్థికశాఖ కార్యదర్శి ఏకంగా సెలవు పెట్టి వెళ్లిపోయారట. చంద్రబాబు చెప్పింది చేస్తే ఒక ఇబ్బంది.. చేయకపోతే ఇంకో ఇబ్బంది అన్నట్టు తయారైంది అధికారుల పరిస్థితి. చంద్రబాబు ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకిరారు  అన్న నమ్మకం ఉన్న అధికారులు ఆయన్ను చాలా లైట్ గా తీసుకుంటున్నారట.

చంద్రబాబు ఏది చెబితే అది చేయడం మానేశారట. మరికొందరు మాత్రం ఎందుకొచ్చిన గొడవ అన్నట్టు అంటీముట్టనట్టు ప్రవర్తిస్తున్నారట. మొత్తానికి ఎన్నికల పోలింగ్‌కూ.. కౌంటింగ్‌ గతంలో ఎన్నడూ లేనట్టు.. నెల రోజులకు పైగా గ్యాప్ రావడం అధికారులకు ఇబ్బందిగా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: