జగన్ తీసుకునే ఒక్కో నిర్ణయం తెలుగుదేశం పార్టీని విస్మయానానికి గురి చేస్తోంది.  అధికారంలోకి వచ్చాక అనేక మరోపులు చేసింది.  పరిపాలన పరంగా చురుగ్గా ఉండే ఆఫీసర్స్ ను సెలెక్ట్ చేసి పదవుల్లో నియమించింది.  మంత్రి వర్గ విస్తరణలో కూడా చురుకైన తనదైన ముద్రను వేసుకున్నారు.  


గతంలో చంద్రబబు హయాంలో ఇద్దరు డిప్యూటీ సిఎం లు ఉన్నారు.  కానీ, జగన్ హయాంలో ఐదుగురు డిప్యూటీ సిఎం లను నియమిస్తున్నారు.  దీనికి సంబంధించిన ఆదేశాలు ఇప్పటికే జారీ అయ్యాయి.  151 మంది ఎమ్మెల్యేలను సంతోష పెట్టాలి.  అలాగే టాలెంట్ ఉన్న వారిని మంత్రులుగా తీసుకోవాలి. 


ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా చాణక్య నీతిని  పాటిస్తూ జగన్ మంత్రి వర్గ విస్తరణ చేస్తున్నారు.  మంత్రి వర్గం ప్రమాణస్వీకారం జరిగిన వెంటనే.. మంత్రులు విధుల్లో చేరిపోతారు.  చెకచెకా అనుకున్న పనులను నిర్వర్తిస్తారు.  ఎక్కడ అవినీతి కనిపించకూడదని ఇప్పటికే ముఖ్యమంత్రి హుకుం జారీ చేసిన సంగతి తెలిసిందే.  


ఇదిలా ఉంటె, ఐదుగురు డిప్యూటీ సిఎం ల విషయంలో తెలుగుదేశం పార్టీ స్పందించింది.  అంతమంది డిప్యూటీ సీఎంలను  నియమించడం వలన  ఉపయోగం ఏంటో జగన్ కే తెలియాలని టిడిపి నేతలు అంటున్నారు. మంత్రులను నియమించుకునే స్వేచ్ఛ ముఖ్యమంత్రికి ఉందని టిడిపి నేతలు చెప్పడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: