రాజకీయ రంగానికి సినిమా రంగానికి దగ్గర అవినాభావ సంబంధం ఉంది.  ఈ సంబంధంతోనే చాలామంది సినిమా రంగానికి చెందిన ప్రముఖులు రాజకీయాల్లోకి వస్తుంటారు.  రాజకీయాల్లో రాణిస్తుంటారు.  కొంతమంది రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యంతో కొత్త పార్టీలు పెడుతుంటారు.  


సొంతంగా పార్టీలు పెట్టి ముఖ్యమంత్రిగా ఎదిగిన సినీ ప్రముఖులు ఎందరో ఉన్నారు.  ఇప్పటి వరకు ఎంతోమంది సినిమా రంగానికి చెందిన వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చారు.  వచ్చిన చాలామంది రాజకీయాల్లో ఎదిగారు.  ఇది వేరే సంగతి.  


అసలు విషయం ఏమిటంటే, సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తుల్లో.. పార్లమెంట్లోకి అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు.. అనే విషయం ఎవరికైనా తెలుసా.. మంచి కంఠం కలిగిన వ్యక్తి ఆయన. ఆయన ఎవరో కాదు.. కొంగర జగ్గయ్య.  జగ్గయ్య విద్యార్థి దశనుంచే రాజకీయాల్లో ఉన్నారు.  రాజకీయాలను శాసించారు.  


ప్రజా సోషలిస్టు పార్టీలో చురుకైన పాత్ర పోషించారు.  1956 లో భారత ప్రధాని నెహ్రు పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1967 వ సంవత్సరంలో జగ్గయ్య.. ఒంగోలు పార్లమెంట్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు.  ఇలా సినీ పరిశ్రమ నుంచి పార్లమెంట్ కు ఎంపికైన మొదటి భారతీయ నటుడిగా జగ్గయ్య పేరు తెచ్చుకోవడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: