ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారిగా సీఎం హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు.  ఈ నేపథ్యంలో ఆయన విజయవాడ నుంచి ఢిల్లీ కి పయనమయ్యారు. కాగా రేపు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగుతున్న నీతి అయోగ్ సమావేశానికి సీఎం జగన్ హాజరు అవుతున్నారు. 

అయితే ఈ సమావేశానికి ముఖ్యమంత్రులందరికీ ఆహ్వానం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేక పోతున్నారు.  తెలంగాణ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం  ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో వాటి పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు.

ఈ కారణంగా నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ లేదా ఫైనాన్స్ సెక్రటరీ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: