జనసేన పార్టీ గత ఎన్నికల్లో దారుణంగా ఫెయిల్ అయ్యింది.  రాజకీయ శున్యత లేని సమయంలో ఎన్నికల్లో పోటీ చేయడం జనసేన చేసిన పెద్ద తప్పు అని చెప్పొచ్చు.  పైగా జగన్ ఎన్నికలకు ముందు నాలుగేళ్లపాటు ప్రజల మధ్యలో తిరిగాడు.  వారి సమస్యలను తెలుసుకొని హామీలు ఇచ్చాడు.  నేనున్నాను అని హామీ ఇవ్వడం వలన వైకాపా విజయం సాధించింది. 


జనసేన పార్టీ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. పార్టీ ఓటమిపాలయ్యాక పార్టీని పక్కన పెట్టి పవన్ సినిమాల్లోకి వెళ్తారని అనుకున్నారు.  కానీ, పవన్ మాత్రం ప్రజల మధ్యలోనే ఉంటానని ప్రతిజ్ఞ చేశారు.  చివరి శ్వాస వరకు ప్రజలకోసమే అని చెప్పిన పవన్ చెప్పినట్టుగానే ప్రజల మధ్యలో ఉన్నాడు.  


క్షేత్రస్థాయి నుంచి బలపడేందుకు యత్నాలు చేస్తున్నారు. వచ్చే స్థానిక ఎన్నికల సమయంలోపు కొంతమేర బలపడాలన్నది జనసేన ఉద్దేశ్యం.  ఇదిలా ఉంటె జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని.. పవన్ ఒకే అంటే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.  


రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలహీనపడటంతో... ఆపార్టీలోని నేతలు, ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  వైకాపా ఎలాగో గేట్లు మూసేసింది.  దీంతో నేతలు బీజేపీ లేదంటే జనసేన వైపు చూస్తున్నారు.  బీజేపీలోకి ఇప్పటికే చాలామంది జాయిన్ అయ్యారు.  ఇప్పుడు జనసేనలోకి కూడా నేతల వలస ప్రారంభం కాబోతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: