ప్రస్తుతం కృష్ణానదీ తీరాన చంద్రబాబు ఉంటున్న ఇల్లును ఖాళీ చేయాల్సిందేనని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. చంద్రబాబు ఖాళీ చేయకపోతే కూల్చివేయాల్సి వస్తుందని హెచ్చరించారు ఆయన. ఈ మేరకు సీఆర్డీఏ కమిషనర్ ను కలిసి విజ్ఞప్తి చేస్తామని ఆయన వివరించారు.


గతంలో అదే ఇంటిని చంద్రబాబుకు ఇచ్చేశామని తమకు సంబంధం లేదని ఆ ఇంటి యజమాని లింగమనేని రమేశ్ చెప్పిన విషయాన్ని ఆళ్ల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు అదే లింగమనేని మాట మారుస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ విషయంలో చంద్రబాబు, లింగమనేని రమేశ్ క్లారిటీ ఇవ్వాలని ఆళ్ల డిమాండ్ చేశారు.


మంగళగిరి ఎమ్మెళ్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిమాటలను చూస్తుంటే.. త్వరలోనే కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసాన్ని కూల్చే ఆలోచనలో వైసీపీ సర్కారు ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని సాధ్యమైనంత వరకూ సానుభూతి అంశంగా వాడుకునే ఆలోచన తెలుగుదేశంలో కనిపిస్తోంది.


చంద్రబాబు నివాసం కోసం ప్రత్యామ్నాయ భవానాలను చూసినా.. ఇప్పటి వరకూ మారే ఆలోచన కనిపించడం లేదు. ఓ మాజీ ముఖ్యమంత్రిని ఉంటున్న ఇంటి నుంచి బలవంతంగా ఖాళీ చేయిస్తే అది వైసీపీ కక్షసాధింపుగా జనంలోకి వెళ్తుందని అది తమకు రాజకీయంగా లాభిస్తుందని టీడీపీ భావిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: