ఈ మద్య కాలంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.  చిన్న ప్రమాదల నుంచి భారీ స్థాయిలో ప్రాణాలు కోల్పోతున్న ప్రమాదాలు జరుగుతున్నాయి.  అయితే ఇలాంటి ప్రమాదాలకు ముఖ్యకారణం మద్య సేవించి డ్రైవింగ్ చేయడం..నిద్రలేమితో డ్రైవింగ్ చేయడం, అతి వేగం, అనుకోని విపత్కర పరిస్థితులు.

ఏది ఏమైనా ఒక ప్రమాదం జరిగితే జరిగే ప్రాణ నష్టంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా యూపిలోని ఆగ్రా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యమునా ఎక్స్ ప్రెస్ హైవే పై నుంచి బస్సు కింద పడింది. లక్నో నుంచి ఢిల్లీ వెళ్తున్న బస్సు ఈ ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో 30 మంది మరణించినట్లు వార్తలు అందుతున్నాయి.  సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు మొదలు పెట్టారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్నారు.  మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: