130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇబ్బందుల్లో కూరుకుపోయింది.  స్వతంత్రం లభించిన దగ్గరి నుంచి కాంగ్రెస్ పార్టీలో గాంధీల పాత్ర ప్రముఖంగా ఉన్నది.  ఇందిరాగాంధీ కాలం నుంచి ఇది మరింత ఎక్కువైంది.  గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తులే పార్టీ బాధ్యలను నిర్వహిస్తున్నారు.  


20 సంవత్సరాల పాటు సినిమా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నది.  కొడుకు రాహుల్ వృద్ధిలోకి రావడంతో ఆయనకు అప్పగించింది.  రెండేళ్లలోనే రాహుల్ ఆ పదవిపై అనాసక్తి కలిగింది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి.  ఒకటి విషయాన్నీ బలంగా చెప్పలేకపోవడం, రెండోది గత ఎన్నికల్లో పార్టీ ఓటమి.  


ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో రాహుల్ గాంధీ తన పదవి నుంచి తప్పుకున్నారు.  పార్టీకి రాజీనామా చేశారు.  ఎంత చెప్పినా వినలేదు.  ట్విట్టర్లో పెట్టడంతో ఆమోదించక తప్పలేదు.  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక అధ్యక్షుడిని నియమించినా.. శాశ్వత అధ్యక్షుడి కోసం వెతుకులాట మొదలైంది.  


అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీని నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గాంధీ కుటుంబమే ఆ పదవిని తీసుకోవాలని అప్పుడే పార్టీకి గౌవరం ఉంటుందని అంటున్నారు.  మరి దీనికి ప్రియాంక గాంధీ ఒప్పుకుంటుందా.. చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: