ప్ర‌జా ప్ర‌తినిధులు ఎన్నిక‌ల్లో గెలిచే వర‌కు ప్ర‌జ‌ల‌ను దేవుళ్లుగా పూజిస్తారు. వారు కోరిన కోరికలు తీర్చేస్తామ‌ని చెపుతుంటారు... ప్ర‌మాణాలు చేస్తుంటారు. ఎన్నిక‌ల్లో గెలిచాక వారు అడ్ర‌స్ ఉండ‌రు. అప్ప‌టి వ‌ర‌కు వారి మాట‌లు న‌మ్మి ఎన్నిక‌ల్లో ఓట్లేసి గెలిపించిన వారంతా త‌మ ప్ర‌జా ప్ర‌తినిధి ఎప్పుడు వ‌స్తాడా ? అని క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకుని వెయిట్ చేయ‌డం మిన‌హా చేసేదేం ఉండ‌దు. 


అయితే ఓ నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ ఎంపీ, ఎమ్మెల్యే కోసం వేచి చూసి విసిగు ఎత్తిపోయిన ప్ర‌జ‌లు వారి ఆచూకి చెప్పిన వారికి రూ.501 బ‌హుమానం ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీనిపై ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయ‌డంతో ఈ విష‌యం ఇప్పుడు జాతీయ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా ప్రాంతానికి చెందిన ప్రజలు తమ సమస్యలపై వినూత్న నిరసన చేపట్టారు. తమ ప్రాంతంలోని రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండటంతో ఈ స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని ప‌దే ప‌దే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీకు సూచించారు.


అయితే వారిద్ద‌రు ఈ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు. సూరజ్‌పూర్ గ్రామస్థులు గత సంవత్సరం నుంచి సమస్య పరిష్యారం కోసం ఎవ‌రికి మెర‌పెట్టుకున్నా వారి బాధ‌లు ఎవ్వ‌రికి ప‌ట్ట‌డం లేదు. గ్రామంలో రోడ్లే కాకుండా కరెంట్ స్తంభాలు సరిగా లేకపోవడం వల్ల విద్యుత్తు వైర్లు కిందకి వేలాడుతున్నాయి. ఈ తీగ‌ల‌తో ఎప్పుడు ఎలాంటి ప్ర‌మాదం ముంచుకొస్తుందో ?  తెలియ‌క ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.


చివ‌ర‌కు వీళ్లు నిర‌స‌న‌తోనే ప్ర‌జాప్ర‌తినిధుల మెడ‌లు వంచాల‌ని డిసైడ్ అయ్యారు. తమ సమస్యల పరిష్కారం కోసం రెండు రోజులుగా నిరసన చేపట్టారు. నిర‌స‌న‌లో ప‌లువురు గ్రామాస్తులు కూర్చొన్నారు. తమ ప్రాంత ఎమ్మెల్యే తేజ్‌పాల్ నాగర్, ఎంపీ మహేశ్ శర్మ‌ల జాడచెప్తే రూ. 501 బహుమానం ఇస్తామని ప్రకటించారు. దీంతో ఈ విష‌యం ఇప్పుడు నేష‌న‌ల్ మీడియాలో హైలెట్ కావ‌డంతో ఆ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు షాక్ త‌గిలిన‌ట్ల‌య్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: