తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటి అంటే రాజధాని మార్పు.  రాజధానిని అమరావతి నుంచి మారుస్తున్నారనే వార్త తెలుగు రాష్ట్రాల్లో దావానంలా వ్యాపించింది.  ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియదు.  వరదల సమయంలో బాబు చేసిన వ్యాఖ్యలు, బొత్స చేసిన వ్యాఖ్యలతో ఒక్కరిగా ఈ విషయంపై చర్చకు వచ్చింది.  దీన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో వివిధ నాయకులు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు.  



దీనిపై ఈరోజు వైకాపా నేత విజయసాయి రెడ్డి స్పందించారు.  రాజధాని మార్పు విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ వార్తలు కేవలం పుకార్లే అని అన్నారు.  ఏపీ రాజధాని మార్చే యోచన ఉందని ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.  అమరావతిలోని కొండవీటి వాగు వలన ముప్పు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. 

పోలవరం రివర్స్ టెండరింగ్ పీపీఏల పున:పరిశీలన అంశాల్లో నరేంద్రమోదీ, అమిత్ షాను సంప్రదించే నిర్ణయం తీసుకున్నామని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో ఎక్కడా తగాదా పెట్టుకునే పరిస్థితిలేదన్నారు. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీడియాకు తెలియకుండా నిర్ణయం తీసుకోదు కదా? అని అయన ప్రశ్నించారు.  



ఇదిలా ఉంటె, కొన్ని రోజులుగా అమరావతి విషయంలో వస్తున్న వార్తలతో ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతంలోని భూములకు రెక్కలు వచ్చాయి.  అక్కడ భూములను కొనేందుకు బడాబడా నేతలు క్యూ కడుతున్నారు.  రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి. 


నీళ్లు కూడా సరిగాలేని ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఎకరం రూ. 20 లక్షల రూపాయల వరకు పలుకుతున్నది.  ఇదే విధమైన ప్రచారం మరికొన్ని రోజులు జరిగితే.. ఈ రేటు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, మార్పు విషయం కేవలం ప్రచారం వరకే పరిమితం అవుతుందో లేదంటే.. నిజంగానే మార్పు జరుగుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: