అనగనగా ఓ హోటల్.. ఆ హోటల్ నిత్యం కష్టమర్ల రద్దీగా ఉంటుంది.  అయితే, అనుకోకుండా ఆరోజు ఖాళీగా ఉన్నది. అదే అదునుగా భావించిన ఓ దొంగ.. హోటల్ లోకి దూరాడు.  అలా హోటల్ లోకి దూరిన ఆ దొంగ రిసెప్షన్ లో ఉన్న మహిళను తుపాకీతో బెదిరించాడు.. కౌంటర్లో ఉన్న డబ్బును ఇవ్వాలని బెదిరించారు.  ఓ రెండు నిమిషాలు ఆలోచించిన ఆ మహిళా.. డెస్క్ లో ఉన్న డబ్బును తీసి అతని ముందు విసిరేసింది.  


టేబుల్ పై కొంత.. మిగతా మొత్తం టేబుల్ కింద పడింది.  డబ్బు కిందపడటంతో.. పాపం ఆ దొంగగారు హడావుడిలో తన దగ్గర ఉన్న తుపాకిని టేబుల్ పై ఉంచి కిందపడిన డబ్బును ఏరుకునే పనిలో పడిపోయాడు. అది గమయించిన ఆ మహిళా.. వెంటనే గన్ తీసుకొని దొంగను బెదిరించింది.. అతనిపై కాల్పులు జరిపింది.  వెంటనే ఆ దొంగగారు.. భయపడి డబ్బు అక్కడే వదిలేసి బతుకు జీవుడా అంటూ పారిపోయాడు.  


ఈ తతంగం అంతా రిసెప్షన్ లో ఉన్న సిసి టీవీలో రికార్డ్ అయ్యాయి. అనంతరం సిసి టీవీ ఫుటేజ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది.  మహిళా ధైర్యాన్ని మెచ్చుకుంటూ మెసేజ్ చేస్తున్నారు.  ఇక హోటల్ యాజమాన్యం సైతం ఆ మహిళను మెచ్చుకుంటూ రివార్డ్ ప్రకటించింది.  ఇలాంటి తెగువ ప్రతి ఒక్కరు ప్రదర్శిస్తే చాలా బాగుంటుంది కదా.  


ఎవరైనా సరే మనదగ్గరకు వచ్చి బెదిరించగానే ముందు మనలోని ఫ్లైట్ హార్మోన్లు ఉత్తేజం అవుతాయి.  ఫలితంగా మనం అక్కడి నుంచి పారిపోవాలని చూడటమో లేదంటే.. మన దగ్గర ఉన్న వస్తువులు ఇచ్చేయడమో చేస్తుంటారు.  అలా కాకుండా ఈ మహిళలా ధైర్యంగా సాహసం చేస్తే ఎంత పెద్ద దొంగ అయినా పారిపోతాడు.  ఎంత పెద్ద సమస్య అయినా క్షణాల్లో దూరం అవుతుంది.  మనం ఎంచుకునే విషయం మీదనే ఇది ఆధారపడి ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: