నేను మోనార్క్ ని నన్నెవరూ మోసం చేయలేరు అన్నట్టుగా..ఆర్టీసీ సమ్మె.. కార్మికుల ఉద్యోగాల విషయంలో కెసిఆర్ ఇలానే చేస్తున్నారు.  ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే అది ఫైనల్ అనేలా ఉన్నాడు.  ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఉద్యోగాల విషయంలో పట్టిన పట్టు వదలడం లేదు.  సమ్మె చేస్తున్న కార్మికులను ఉద్యోగంలో తీసుకునే ప్రసక్తి లేదని ఇప్పటికే స్పష్టం చేశారు.  


అంతేకాదు, ఆర్టీసీని  ప్రభుత్వంలో విలీనం చేయడం అన్నది జరగని పని అని, కార్మికుల వలన ఆర్టీసీకి జరిగిన నష్టాన్ని కోర్టుకు వివరించాలని, దానికి తగినట్టుగా కోర్టులో డాకుమెంట్స్ ఫైల్ చేయాలనీ కెసిఆర్ ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా ప్రభుత్వం, ఆర్టీసీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే వాటి గురించి కూడా కోర్టుకు తెలియజేయాలని ఆర్టీసీ యాజమాన్యానికి, రవాణా సఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.  


అయితే, అక్టోబర్ 18 లోగా ప్రభుత్వం కార్మికులను చర్చలకు పిలవాలని.. చర్చించి దానికి సంబంధించిన విషయాలను కోర్టులో ఫైల్ చేయాలని అక్టోబర్ 15 వ తేదీన కోర్టు సూచించింది.  కానీ, కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపలేదు.  అలాంటి అవసరం లేదన్నట్టుగా ప్రభుత్వం తేల్చేసింది.  బతుకమ్మ, దసరా సమయంలో సమ్మె దిగిన కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారని, వారితో చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఇప్పటికే స్పష్టం చేశారు.  


అటు కార్మికులు కూడా ఈరోజుతో ఈ విషయంపై కోర్టు స్పష్టత ఇవ్వాలని లేదంటే అక్టోబర్ 19 వ తేదీన బంద్ తో తమ సత్తా ఏంటో చూపుతామని అంటున్నారు.  ఏది ఏమైనా సరే బంద్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఆర్టీసీ కార్మికులు స్ఫష్టం చేస్తున్నారు. అటు కార్మికులు, ఇటు కెసిఆర్ ఇరువురు కూడా ఈ విషయంలో పట్టు వదలడం లేదు.  మరి ఏం జరుగుతుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: