2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు.  అయన ఎన్నికల సమయంలో వేలాది హామీలు ఇచ్చారు.  అందులో ఎన్ని హామీలు అమలు చేశారు అని లెక్కేసుకుంటే ఒకటి రెండుకు మినహా పెద్దగా ఏమి ఉండవు.  అన్ని సగంసగం మాత్రమే జరిగి ఉంటాయి.  అందులో అమరావతి హామీ కూడా ఒకటి. 2018 చివరి నాటికీ మొదటి దశ నిర్మాణాలు పూర్తిచేస్తామని చెప్పిన బాబుగారు ఆ నిర్మాణాలు ఏమయ్యాయో తెలియదు.  


శాశ్వత నిర్మాణాల స్థానంలో తాత్కాలిక నిర్మాణాలు ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో తెలియదు.  అంతేకాదు, ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన బాబు, నాలుగేళ్లు బీజేపీతో కలిసి ప్రయాణం చేసిన తరువాత, బీజేపీని పక్కన పెట్టి కాంగ్రెస్ తో దోస్తీ కట్టారు.  తరువాత కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చారు.  ఇప్పుడు బీజీపీని వ్యతిరేకించి పెద్ద తప్పు చేశామని అంటున్నాడు.  అయితే, బీజేపీ మాత్రం తెలుగుదేశం పార్టీతో ఇకపై కలిసే సమస్య లేదని స్పష్టం చేశారు.  


ఇక ఇదిలా ఉంటె, 2019 ఎన్నికల్లో  పూర్తిగా మారిపోయింది. జగన్ కు పూర్తి మెజారిటీ ఇచ్చారు.  ఏకంగా 151 సీట్లు ఇచ్చి గెలిపించారు.  తెలుగుదేశం పార్టీ కేవలం 123 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో బాబుగారు అవకాశం దొరికినప్పుడల్లా వైకాపాను విమర్శించడం మొదలుపెట్టారు.  ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాల విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.  ప్రతి పధకాన్ని విమర్శిస్తుండటంతో వైకాపా నేత సి రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడ్డారు.  


వైకాపా అధికారంలోకి వచ్చి కేవలం నాలుగు నెలలే అయ్యిందని, అయినప్పటికీ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో ఉపయోగపడే పధకాలు తీసుకొచ్చిందని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ నేతలు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.  ప్రజలకు ఉపయోగపడే పధకాలు ప్రవేశపెట్టినప్పుడు సపోర్ట్ చేయాలనిగాని అదే పనిగా విమర్శలు చేయడం తగదని అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: