డీజీపీ ఆఫీస్‌ని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చారని  మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు  విమర్శలు చేసారు.టీడీపీ ఎమ్మెల్యేలు,డీజీపీని కలవాలని వెళితే ,ఆయన తమని ఎందుకు కలవలేదని  చంద్రబాబు ప్రశ్నించారు.ఏపీ మాజీ ముఖ్యమంత్రి,  తెలుగు దేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు,ప్రస్తుత  ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై పలు ఆసక్తికరమయిన  వ్యాఖ్యలు చేశారు. జగన్‌తో పోలిస్తే రాజశేఖర్ రెడ్డి వెయ్యి రెట్లు బెటర్ అని చెప్పచు అని,రాజశేఖర్ రెడ్డికి పట్టు విడుపు ఉండేది అని చంద్రబాబు పేర్కొన్నారు.

వైఎస్ఆర్‌ అన్ని విషయాలు  హుందాగా వ్యవహరించేవారని చంద్రబాబు అన్నారు. ఎటువంటి విషయం తప్పు అని చెప్పినా,రాజశేఖర్ రెడ్డి దానిని విని,స్వీకరించేవారని,వెనక్కి కూడా తగ్గేవరని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. మీడియాపై ఆంక్షల విధించే  విషయంలో సీఎం జగన్  వెనక్కి తగ్గితే మంచిదని,చంద్రబాబు చెప్పారు. అలా తగ్గని పక్షంలో అదే ఈ ప్రభుత్వానికి శాపంగా మారుతుందని పేర్కొన్నారు.

డీజీపీ ఆఫీస్‌ను వైసీపీ కార్యాలయంగా మార్చటం పై, చంద్రబాబు  అనేక విమర్శలు చేసారు టీడీపీ ఎమ్మెల్యేలు, డీజీపీని కలిసేందుకు వెళితే, ఎందుకు కలవలేదని ఆయన ప్రశ్నించారు. డీజీపీ సహనం కోల్పోతున్నారని,ఎందుకు ఇలా చేస్తున్నారో తనకు  అర్థంకావడం లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తనకు నోటీసులు పంపిస్తామన్న  డీజీపీ వ్యాఖ్యలుపై చంద్రబాబు  తప్పుపట్టారు. ఇప్పటికే  ఇసుక కొరతతో అనేక లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడవకుండానే ఇన్ని  అరాచకాలు చేస్తున్నారని  కారాలు,మిరియాలు  నూరారు చంద్రబాబు.

ఇక సచివాలయ ఉద్యోగాల విషయానికి వస్తే  ప్రశ్నా పత్రం,టైప్ చేసిన వ్యక్తికే  మొదటి ర్యాంక్ రావటం,ఈ ప్రభుత్వ  చేసే అక్రమాలపై ఇంతకన్నా రుజువు ఇంకేం కావాలని ఆయన  ప్రశ్నించారు.కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు పరీక్షలు రాయకూడదు  అని తాను అనటం లేదు అని,కానీ వారికే మొదటి ర్యాంక్ రావడం వెనుక దాగి ఉన్న కుట్ర  ప్రజలు గ్రహించాలని, అన్నారు. ఇపటివరుకు జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: