ఏపీ సీఎం జగన్ మరో ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని వైయస్‌ జగన్‌ మాట ఇచ్చారు. ఈ మేరకు మొదటి కేబినెట్‌ సమావేశంలోనే తీర్మానం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ విషయం ప్రకటించారు. ఇప్పుడు ఇచ్చిన మాట మేరకు అగ్రిగోల్డు బాధితులను ఆదుకునేందుకు నిధులు కేటాయించారు.ఆంధ్రరాష్ట్రంలో అగ్రిగోల్డు బాధితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం వైయస్‌ జగన్‌ రూ.1150 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.


ఎన్నికల సమయంలో అగ్రిగోల్డు బాధితులను ఆదుకుంటామని వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ మూడు నెలల కాలంలోనే నెరవేరింది. రూ. 20 వేల లోపు ఉన్నవారికి ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించనున్నారు. అగ్రిగోల్డు బాధితులకు మొదటి విడతగా 3, 69,655 మంది రూ.10 వేల లోపు బాధితులకు రూ.263.99 కోట్లను విడుదల చేశారు. దేశంలో అనేక చోట్ల అనేక కుంభకోణాలు జరిగాయి.. కానీ ఎక్కడా కూడా బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, 14 ఏళ్లు సీఎంగా అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు అగ్రిగోల్డు బాధితులు పోరాటం చేసినా ఏ నాడు కూడా ఆదుకునే ఆలోచన చేయలేదు.


అగ్రిగోల్డు బాధితులు ఏ ఒక్కరూ కూడా ఆత్మహత్య చేసుకోకూడదని ఆలోచన కలిగిన వ్యక్తిగా, మాటల ప్రభుత్వం కాదు..చేతల ప్రభుత్వమని వైయస్‌ జగన్‌ నిరూపించారు. నవరత్నాలతో పాటు అగ్రిగోల్డు బాధితులను ఆదుకోవడం పది రత్నాల పథకాలుగా అభివర్ణించారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీరును అందరూ హర్షిస్తున్నారు. అగ్రిగోల్డు బాధితులుగా సన్న, చిన్నకారు రైతులు, కూలీలు, కార్మికులు ఉన్నారు.


ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి హామీని వైయస్‌ జగన్‌ నెరవేర్చుతున్నారు. రూ.10 వేల లోపు చెల్లించిన బాధితులకు వారి ఖాతాల్లో డబ్బులు జమా చేసే కార్యక్రమాలు మొదలుపెట్టారు. రూ.20 వేల లోపు కట్టిన ప్రతి బాధితుడిని కూడా ఆదుకునే కార్యక్రమం చేపట్టారు. వారిని గుర్తించే కార్యక్రమాలు మొదలుపెట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: