పెరంబూర్  రాష్ట్రంలో ప్రజలకు విపరీతమైన జ్వరాలు వస్తున్నాయి. అందులో ఎక్కువ మందికి డెంగీ జ్వరాలు వస్తున్నా యి అని డాక్టర్లు ప్రజలకు చెప్పుచున్నారు.ఈ డెంగీ జ్వరాలతో మరణాలు సంభవిస్తున్నాయి.ఇలాంటి సమయం లో డెంగీ బారి నుంచి ప్రజలను కాపాడుకోవడానికి నేలవేమ(నేల వేము) కషాయాన్ని తయారుచేసి ఉచితం గా అందించాలని రజనీకాంత్ తన అభిమానులకు పిలుపు ఇచ్చారు. 


నేల వేమ ఆకు ను ఆంధ్రప్రదేశ్ లో నేల వేము అని పిలుస్తారు.దీని కషాయం షుగర్ కు మరియు పాము కాటుకు కూడా విరుగుడుగా పనిచేస్తుంది.అయితే ఇది వేపాకు కంటే చేదుగా ఉంటుంది.దీని కషాయం డాక్టర్ చెప్పిన మోతాదులో నే తీసుకోవాలి.లేకపోతే చాలా ప్రమాదకరం.
 
 రజనీ కాంత్ ఈ నెల 13 వ తేదీన దర్బార్ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసి ఆ ఆధ్యాత్మిక బాట పట్టి హిమాలయ లకు వెళ్లి పోయాడు.ఐదురోజుల పాటు ఆధ్యాత్మిక పతనాన్ని ముగించుకుని శనివారం చెన్నైకు తిరిగి వచ్చారు.ఈ సందర్భంగా ఆయన చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. పలువిషయాలు చర్చించారు. ఆధ్యాత్మిక పయనం విజయవంతం గా ముగిసింది అని పలువురి కి చెప్పారు. అలాగే దర్బార్ చిత్రం యెుక్క విశేషాలు ముచ్చటించారు.చిత్రం బాగా వచ్చింది అని మంచి స్పందన వస్తోంది అని చెప్పారు.


 హిరో రజనీ కాంత్ దర్బార్ చిత్రం పూర్తి చేసిన తరువాత రాజకీయాలపై దృష్టి సారిస్తారని రాజకీయ పార్టీ నుంచి ప్రారంభిస్తారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. అభిమానులు రాజకీయ రంగ ప్రవేశం పై చాలా నిరాశకు గురయ్యారు కొంత మంది సన్నిహితులు రజనీకాంత్ పక్కాగా రాజకీయాల్లోకి వస్తారని చెప్పుచున్నారు. రజనీకాంత్ త్వరలో 168వ చిత్రం శివ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు.ఆ చిత్రం షూటింగ్ అయిపోగానే రాజకీయ పార్టీ  ప్రారంభిస్తారని తెలిపారు. ఎంతైనా రజనీ కాంత్ గొప్ప సినిమా నటుడు.ఆయన అసలు పేరు శివాజీ రావు.


మరింత సమాచారం తెలుసుకోండి: