ఆదిలాబాద్ జిల్లాలో ఓపెన్ కాస్ట్ గనులకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. పర్యావరణాన్ని దెబ్బతీసే ఓపెన్ కాస్టు బొగ్గు గనులు మాకు వద్దు అనే నినాదంతో ఈ సంఘాలు ఉద్యమించబోతున్నాయి. తూర్పులోని కోల్ బెల్టు ప్రాంతాలైన ఇందారం, రామకృష్ణపూర్, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, కాశీపేటలో సింగరేణి యాజమాన్యం ప్రతిపాదించిన 14 ఓపెన్ కాస్టు గనులను స్థానిక ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ గనుల వల్ల విధ్వంసమే తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఓపెన్ కాస్ఠు పేరుతో పంట పోలాలు, ఊళ్లను ధ్వంశం చేస్తున్నారని ఉద్యమకారులు అంటున్నారు. గనులు తవ్వకంలో భాగంగా జరిపే పేలుళ్ల వల్ల గర్భస్థ శిశువులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వారు ఆందళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: