వరంగల్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది.  గత నెల 4 న ఆయన కోడలు సారిక, మనుమలు రాజయ్య గృహంలో సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో రాజయ్య కుటుంబంపై ఆరోపణలు రావడంతో వారిని అరెస్టు చేసి వరంగల్ సెంట్రల్ జైల్ లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచారు. కాగా తనకు తన కుటుంబ సభ్యులకు బెయిల్ ఇవ్వాల్సిందిగా రాజయ్య కోర్టులో అప్పిల్ చేసుకున్నారు..కానీ పిటిషన్‌ను కోర్టు నిరాకరించింది.

మొదటి నుంచి రాజయ్య కోడలు సారికకు రాజయ్య కుటుంబ సభ్యులకు అంతర్గత కలహాలు ఉండటం..వరంగల్ ఉప ఎన్నికల సందర్భంగా రాజయ్యకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో సారిక అదిష్టానికి లేఖ రాయడంతో ఆమెతో గొడవ పడినట్లు తెలుస్తుంది.  తర్వాత అనుమానాస్పదంగా సారిక, ఆమె కుమారులు రాజయ్య గృహంలో సజీవ దహనం అయిన విషయం తెలిసిందే.

సారిక ఆమె ముగ్గురు కుమారులు


ఈ హత్య గల కారణాలు రాజయ్య కుటుంబ సభ్యులే అని అనుమానంతో రాజయ్య,ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్ కుమార్ అరెస్టు చేశారు. గతంలో కూడా రాజయ్య కుటుంబ సభ్యులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ని కోర్టు తిరస్కరించింది.తాజాగా మరోసారి సారిక  హత్య కేసులో రాజయ్య బెయిల్ పిటిషన్‌ని కొట్టివేస్తు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: