దేశంలో రోడ్డు ప్రమాదాలు మరీ ఎక్కువ అయిపోతున్నాయి..దీనికోసం రోడ్డు రవాణా సంస్థ ఎన్నో కఠిన నియమాలు పెట్టినప్పటికీ కొన్ని నిర్లక్ష్యాల వల్ల ప్రమాదం జరిగిపోవడం కుటుంబ సభ్యులు కన్నీటీ పర్యంతం కావడం జరుగుతుంది. అయితే కారు నడిపేటపుడు సీటు బెల్ట్ తప్పని సరిగా పెట్టుకోవాలని, తాగి వాహనాలు నడపవద్దని ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా వీటిని లెక్కచేయక ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు.

తాజాగా తెలంగాణ లో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో హెల్మెట్ వాడకంపై ఇప్పటికే ఎన్నో రకాలుగా అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా ద్విచక్రవాహన చోదకులతోపాటు వెనక కూర్చున్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. లేదంటే ఫైన్ కట్టాల్సిందే. మొండికేస్తే వాహనం తాత్కాలిక జప్తుకు గురవుతుంది. అయితే ఈ చట్టం దేశ రాజధాని ఢిల్లీ సహా కర్ణాటకలోని ప్రధాన నగరాలు, కేరళలో అమలు చేస్తున్న ఈ విధానాన్ని హైదరాబాద్‌లో పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

హెల్మెట్ పై అవగాహన సదస్సు


ద్విచక్రవాహనం నడిపే వారితోపాటు వెనక కూర్చున్నవారు కూడా హెల్మెట్ ధరించాల్సిందేనని రవాణాశాఖ చట్టం చెబుతోంది. ఇక హైదరాబాద్ లో హెల్మెట్ ధరించే విషయంలో పోలీసు, రవాణాశాఖలు సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రవాణా సంస్థ పెట్టే నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని  హెల్మెట్ లేకుండా పట్టుబడితే రూ.200 ఫైన్ కట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: