ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం సేవించి చనిపోయిన విషయం తెలిసిందే..  విజయవాడలోని  స్థానిక కృష్ణలంక నెహ్రు నగర్ లోని  స్వర్ణ బార్లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందగా.. మరో 25 మంది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.  ఇక కల్తీ మద్యం కేసులో ఒక నిందితుడు, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ముందస్తు బెయిల్‌ను విజయవాడలోని ఎమ్‌ఎస్‌జె కోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ బెయిల్‌ పిటిషన్‌పై డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ బి రామకోటేశ్వరరావు వాదన వినిపిస్తూ, పోలీసులు విష్ణును విచారించి వివరాలు సేకరించాల్సి ఉందని తెలిపారు.

మల్లాది విష్ణును బుధవారం (జనవరి 6) కోర్టు ముందు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు మల్లాది విష్ణు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మెట్రోపాలిటన్ న్యాయస్థానం సోమవారం నాడు కొట్టి వేసింది. న్యాయమూర్తితో 41ఏ నోటీసు పేరుతో విచారించి 41ఏ(3) కింద అరెస్టు చేసే ప్రమాదముందని, అరెస్టు చేయరని హామీ ఇస్తే తన క్లయింటు సిట్‌ ముందు విచారణకు హాజరవుతారని విన్నవించారు.

కల్తీ మద్యం సేవించిన వారిని పరామర్శిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు


దీనిపై బైరా.. ‘మేము 41ఏ కింద నోటీసు ఇస్తున్నాం కావున మేము అరెస్టు చేయం’ అని నోటీసు తీసుకోమని కోరగా బెనర్జీ నోటీసును అందుకున్నారు. ముందస్తు బెయిల్‌ పిటీషన్‌పై విచారణ అవసరం లేదని, సిట్‌ అధికారుల ముందు ఈ నెల 6న హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ కేసులో మల్లాది విష్ణు సోదరుడు శ్రీనివాస్‌తో సహా పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు విష్ణుని 9వ నిందితుడిగా చార్జిషీట్‌లో చేర్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: