మోడీ, బాబు అభివృద్ధి జోడీ.. ఇదీ తరచూ ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత పలు వేదికలపై టీడీపీ, బీజేపీ నేతలు వల్లె వేసిన నినాదం.. కేంద్రంలో మనకు అనుకూలమైన సర్కారు ఉంది. నిధులు తెచ్చుకోవడంలో మనకు వెసులు బాటు ఉంది.. అందులోనూ కేంద్రంలో కీలకంగా ఉన్న వెంకయ్యనాయుడు మనవాడే.. అన్న భరోసాలో ఇప్పటివరకూ టీడీపీ నేతలు ఉన్నారు. 

ఆ భరోసా అంతా వట్టిదేనని మరోసారి తేలిపోయింది. ఏపీకి అందిన రాష్ట్ర సాయం గురించి తెలుసుకుంటే ఈ విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది. వాస్తవానికి  కేంద్రం ఏపీ భారీగానే కరవు సాయం  భారీగా ఆశించింది. ఏపీ సర్కారు  అక్టోబర్‌ లో 196 కరవు మండలాలు, నవంబర్‌లో మరో 163 మండలాలు ప్రకటించింది. మెుత్తం 359 కరవు మండలాలను ప్రకటించి 2059 కోట్ల రూపాయల సాయం అవసరవమని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. 

అడిగినంత ఇస్తారని ఆశలు లేకపోయినా.. అందులో సగమైనా ఇస్తారని ఆశించింది. కానీ కేంద్రం నుంచి ఆశించినంత నిధుల సాయం రాలేదు.  రాష్ట్రానికి 434 కోట్ల రూపాయల కరవు సాయం ఇవ్వడానికి మాత్రమే కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే మిగిలిన రాష్ట్రాలకు ఇచ్చిన సాయం ఓ సారి చూస్తే మాత్రం ఏపీకి అన్యాయం జరిగిందని చెప్పొచ్చు. ఉత్తర్ ప్రదేశ్ కు 1304 కోట్లు, ఒడిశాకు 815 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

కేంద్రంలో టీడీపీ సర్కారు మద్దతు పెద్దగా అవసరం లేకపోవడం, కేంద్రం పథకాలను ఏపీ తన సొంత పథకాలుగా ప్రచారం చేసుకోవడం.. ఏపీ బీజేపీ నాయకులతో టీడీపీ నేతలు సఖ్యతగా లేకపోవడం వంటి కారణాలతో కేంద్ర సాయం ఆశించినంతగా ఉండట్లేదేమో అన్న అనుమానాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరవు కోరల్లో చిక్కుకున్న రాష్ట్రాన్ని ఈ కాస్త నిధులతో బాబు ఎలా నెట్టుకొస్తారో.. చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: