ఇంగ్లండ్ క్రికెట్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే ససెక్స్ ఆటగాడు మాథ్యూ హోబ్డెన్ మృతి ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే మరో యువ క్రికెటర్ ప్రాణాలు కోల్పోవడం ఇంగ్లీష్ క్రికెట్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది.బైడ్‌ఫోర్డ్ బ్రిడ్జి వద్ద టామ్ అలిన్ మృతదేహం సోమవారం లభ్యమైందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. టామ్ అలిన్ మరణవార్తను ధృవీకరిస్తూ వార్విక్‌షైర్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.

'టామ్ మరణం క్లబ్ లోని ప్రతి ఒక్కర్ని కలచివేసింది. మా క్లబ్ లోఅతను ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లతో పాటు, దేశవాళీ వన్డేలు(లిస్ట్-ఏ)లు కూడా ఆడి మంచి క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. కాగా, కొన్ని పరిస్థితుల కారణంగా రెండు సంవత్సరాల క్రితం క్లబ్ ను  వదిలేశాడు. వార్విక్ షైర్ కు ఆరు సంవత్సరాల పాటు సుదీర్ఘ  సేవలందించిన టామ్ అలిన్.. 2013 లో తన సొంత జట్టు డేవోన్ కు తిరిగొచ్చేశాడు.అతని మరణం క్రికెట్ కు లోటు' అని వార్విక్ షైర్ తెలిపింది. మరోవైపు ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు కూడా టామ్ మృతిపట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: