ప్రపంచంలో ఎక్కవ శాతం భూకంపాలు, సునామీ విద్వంసాలు జరిగే ప్రాంతం ఏదంటే వెంటనే గుర్తుకు వచ్చేది జపాన్.  ఈ దేశం చిన్న దేశమైనా ప్రపంచంలో టెక్నాలజీ పరంగా ముందంజలో ఉంది. తాజాగా జపాన్ లో గురువారం తెల్లవారు జామున 3.25 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. షింజునాయ్ కి 51 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు జపాన్ మెట్రియొలాజికల్‌ ఏజెన్సీ వెల్లడించింది.

కాకపోతే ఈ భూకంపతీవ్రతతో చిన్న చిన్న నష్టాలే సంభంచినా ప్రాణ నష్టం, పెద్దగా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెల్పుతున్నారు. కాగా భూప్రకంపనలతో ఉరకవా పట్టణ ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: