భారత దేశంలో రోజు రోజూకీ మానవత్వం నశించి పోతుంది..ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు చూస్తుంటే భవిష్యత్ లో మహిళలు, యువతులు, చిన్నారు బయట తిరగాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ చూసినా వయసుతో నిమిత్తం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు చేస్తున్నారు. మరో భాదాకరమైన విషయమేమిటంటే ఇందులో మైనర్లు కూడా ఉంటున్నారు. అంటే పరిస్థితి ఎంత దారణంగా తయారైందో వేరే చెప్పనవసరం లేదు. అంతే కాదు పెరుగుతున్న టెక్నాలజీ ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు..అందులో ఫోర్న్ కి సంబంధించిన చిత్రాలు, వీడియోలు లాంటి ప్రభావం యువతపై పడుతుంది.

తాజాగా చికిత్సకోసం దవాఖానకు బయలుదేరిన ఓ మహిళపై దారుణం జరిగింది. నడిరోడ్డుపైనే బట్టలిప్పి లైంగిక దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో మొత్తం 14మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అహ్మద్‌నగర్ జిల్లా వదాలీ గ్రామానికి చెందిన 30 ఏండ్ల మహిళ ఈ నెల 14న వైద్యం కోసం సమీపంలోని ఖాస్తీ గ్రామానికి నడచుకుంటూ బయలుదేరింది. మార్గ మద్యలో ఓ యువకుడు మాయమాటలు చెప్పి బైక్ బలవంతంగా ఎక్కించాడు..దీన్ని గమనించిన ఖాస్తీ గ్రామస్తులు కొందరు.. బైక్‌ను ఆపి, మహిళపై కట్టెలతో దాడి చేశారు. అనంతరం బట్టలిప్పి పరుగులుతీయించారు. నగ్నంగా ఉన్న ఆమెపై ఓ యువకుడు దారుణంగా అత్యాచారాం చేశాడు.

అతికష్టమ్మీద తన ఇంటికి చేరుకోగా, వదాలీ గ్రామానికి చెందిన మహిళలు కూడా దాడి చేసి కాలువలో పడేశారు. మరుసటిరోజు స్థానికులు ఆమెను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అహ్మద్‌నగర్ దవాఖానలో చికిత్సపొందుతున్న బాధితురాలు, మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. ఆమె నుంచి దాడి వివరాలు సేకరించామని పోలీసులు తెలిపారు. యువకుడితో బైక్‌పై వెళ్లినందుకే దాడి జరిగి ఉంటుందని పోలీసులు అంటున్నారు. మొత్తం 14మందిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: