అతనో ప్రభుత్వం ఉద్యోగి నెల నెల ఖచ్చితంగా జీతం తీసుకునే వ్యక్తి..అంతే కాదు హోదా కూడా పెద్దదే, కానీ మనిషి స్వార్థం, డబ్బుపై వ్యామోహం తో తప్పుడు బాట పట్టాడు. అడ్డగోలు లంచాలు తీసుకుంటూ అక్రమంగా తన ఆస్తిని పెంచుకుంటూ పోయాడు. పాపం ఎప్పటికీ దాగదు కదా..అలాగే ఈయన వ్యవహారం కూడా బయట పడింది ఇంతకీ ఆయన ఎవరా అనుకుంటున్నారా..! పశ్చిమగోదావరి జిల్లా చాగల్లులో ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆదిశేషు.

ఈయన ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు దాడులో చేసారు. అదే సమయంలో గుంటూరులో, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులోనూ ఎసిబి అధికారులు సోదాలు చేశారు. గుంటూరు, ఏలూరుల్లోని ఆదిశేషు బంధువుల నివాసాల్లో ఎసిబి అధికారులు సోదాలు చేశారు. ఆదిశేషుకు చెందిన దాదాపు రూ.100 కోట్ల అక్రమాస్తులు సోదాల సందర్భంగా ఎసిబి అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో కళ్లు బైర్లుకమ్మే నిజాలు వెలుగుచూశాయి.

విజయవాడలో ఒక ప్లాట్‌, కాకినాడలో 8 ప్లాట్లు, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో 22.65 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. ఆదిశేషు నివాసంలో రూ.2.82 లక్షల నగదు, బ్యాంకులో రూ.28 లక్షల నగదు, రూ.5.5 లక్షల ఎఫ్‌డీ పత్రాలు, అర కేజీ బంగారం, రెండున్నర కిలోల బంగారం, రూ.30 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు స్వాధీనం చేసుకున్నారు.ఈ సోదాల్లో మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉంది.

ఆదిశేషు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న దృశ్యం


ప్రస్తుతం చాగల్లు బెవరేజెస్ కార్పోరేషన్‌లో పనిచేస్తున్న ఆదిశేషు ఆదయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలు వచ్చాయి. తమకు అందిన సమాచారం మేరకు ఎసిబి అధికారులు ఆదిశేషు ఇంటిలోనే కాకుండా ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: