మహిళపై అసభ్యంగా ప్రవర్తించి ఆమెను వేధించిన కేసులో మంత్రి రావెల కిషోర్ తనయుడు రావెల సుశీల్ పె సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. మరో వైపు మహిళా సంఘాలు సుశీల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక రావెల సుశీల్ చెప్పిన పిట్టకథల్లో ఏమాత్రం నిజం లేదని నిర్ధారించిన పోలీసులు ఆయనపై చర్యలు తీసుకోవడానికి సమాయత్తం అయ్యారు. మరో వైపు  మీడియాలో ఏ చానల్ చూసినా ఈ విషయంపైనే చర్చ కొనసాగుతుంది.  

దీంతో ఇరు రాష్ట్రాల మద్య మరో వివాదం చెలరేగుతుందేమో అన్న అనుమానాలు సర్వత్రా వినిస్తున్నాయి. ఈ నేపథ్యంలో  మహిళను వేధించిన కేసులో తన కుమారుడు రావెల సుశీల్ ను ఏపీ మంత్రి రావెల కిశోర్ స్వయంగా బంజారాహిల్స్ స్టేషన్ లో పోలీసులకు అప్పగించారు.  అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నందున, ఇక వేచిచూడరాదని భావించిన రావెల తన కుమారుడు, ఆయన డ్రైవర్ ను తీసుకుని గత రాత్రి 11 గంటలకు స్టేషన్ కు తీసుకువచ్చారు.

ఎట్టకేలకు రాత్రి  ఒంటి గంట సమయంలో సుశీల్ స్వయంగా వచ్చి లొంగిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. నేడు కోర్టుకు సెలవు కావడంతో న్యాయమూర్తి ఇంటికి సుశీల్ ను తీసుకువెళ్లవచ్చని సమాచారం తెలుస్తుంది. అంతకన్నా ముందు సుశీల్ కు వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: