తెలంగాణకు చెందిన ఒవైసీ బ్రదర్స్  ఎప్పుడూ మతపరమైన, లేదా దేశంపైన ఎదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కడం కామన్. ఈ నేపథ్యంలో  ఎంఐఎం నేత ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన గొంతు మీద కత్తి పెట్టి…భారత్‌ మాతా కి జై అనే నినాదాన్ని చెప్పమన్న అలా చెప్పబోనని అసదుద్దీన్‌ వ్యాఖ్యానించారు. తాజాగా ఈ వ్యాఖ్యలు చేసిందుకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై మల్కాజిగిరి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు దాఖలైంది.

భారత్‌మాతాకీ జై అనను అని అన్నందుకు ఆయనపై కేసు నమోదు చేయాలని సాయిగౌడ్ అనే న్యాయవాది కోర్టులో ప్రైవేట్ ఫిటీషన్‌ దాఖలు చేశారు.  అయితే దీనిపై స్పందించిన న్యాయస్థానం సెక్షన్ 153ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని నేరేడ్‌మెట్ పోలీసులను ఆదేశించింది. మరో వైపు భారత్ మాతాకీ జై అనే ప్రసక్తే లేదన్న ఎంపీ  అసదుద్దీన్ వ్యాఖ్యలపై రాజ్యసభలో నామినేటెడ్ సభ్యుడు, సినీ రచయిత జావేద్ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత దేశంలో పుట్టి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక నేత ఇలా వ్యాఖ్యానించడం ఎంతమాత్రం మంచి పద్దతి కాదని భారత్ మాతాకీ జై అనాలని రాజ్యంగంలో లేదంటున్నారు. మరి షేర్వానీ ధరించి టోపీ పెట్టాలని రాజ్యంగంలో ఉందా అని జావేద్ ప్రశ్నించారు.భారత్ మాతాకీ జై అనడం తన బాధ్యత కాదు హక్కు అన్నారు. జావేద్ భారత్ మాతాకీ జై... భారత్ మాతాకీ జై.... భారత్ మాతాకీ జై.... అని నినదించగానే సభలోని పలువురు సభ్యులు హర్షధ్వానాలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: