ప్రస్తుతం ప్రపంచంలో ఉగ్రవాదం విలయతాండవం చేస్తుంది..ఎప్పుడు ఎక్కడ బాంబ్ పేళుతుందో..ఎక్కడ మిలిటెంట్లు తుపాకులతో స్వైరవిహారం చేస్తారో తెలియని పరిస్థితి. నిన్న పాకిస్థాన్ లో బస్సులో బాంబు పేలి పదిహేను మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రెండు విమానాల్లో బాంబులు పెట్టినట్లు ఫోన్ కాల్ రావడంతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో ఢిల్లీ నుంచి నేపాల్, భువనేశ్వర్ వెళుతున్న రెండు ఎయిర్ ఇండియా విమానాలను నిలిపివేశారు.

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బెదిరింపుల నేపథ్యంలో విమానాలను నుంచి ప్రయాణికులను దించేశారు. బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టింది.  పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రవాద దాడి దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసారు.ఎయిర్ పోర్టులోని రెండు విమానాల్లో బాంబులు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఎయిర్ పోర్టు సిబ్బందికి ఫోన్ చేసి చెప్పారు.

దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన భద్రతా అధికారులు ఎయిర్ పోర్టు పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన వారిని కుడా క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. బాంబులను కనిపెట్టే శునకాలకు కుడా రంగంలోకి దింపారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది


మరింత సమాచారం తెలుసుకోండి: