విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మద్య ఇప్పటి వరకు పలు దఫాలుగా సమస్యలపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఏపీ ఉన్నత విద్యామండలి విషయంలో తెలంగాణ, ఏపీ సర్కార్ల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాదులోని ఉన్నత విద్యా మండలి ఆస్తులు, బ్యాంకు ఖాతాలపై పూర్తి స్థాయి హక్కులు తమవేనని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వాదించింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు శుక్రవారం నాడు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ ఉన్నత విద్యామండలికి ఊరట లభించింది. ఉన్నత విద్యా మండలి ఆస్తులు తెలంగాణకు చెందుతాయంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది.

పంపకాలు జరగనట్లయితే సెక్షన్ 45 నిరుపయోగం అవుతుందని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. సెక్షన్ 75 ప్రకారం ఆస్తులు తమకే చెందుతాయన్న వాదన సరికాదని, ఆ సెక్షన్ కేవలం సేవలకు సంబంధించిన అంశమని పేర్కొంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పంపకాలు తప్పనిసరి అని కోర్టు చెప్పింది.ఇరు రాష్ట్రాలు కలిసి ఉన్న కాలంలో కొనసాగిన ఉన్నత విద్యా మండలి ఆస్తులు ఒక్క తెలంగాణకు మాత్రమే ఎలా చెందుతాయంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ


అంతేకాక ఈ ఆస్తులు తెలంగాణవేనన్న హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఉన్నత విద్యా మండళ్ల తరపు వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.  ఈ విషయంపై రెండు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశించింది. భజనకు ముందు ఉన్న ఆస్తులను 52:48 ప్రకారం పంచుకోవాలని చెప్పింది. విభజన తర్వాత ఆస్తులు, అప్పులు ఇరు రాష్ట్రాలకు పంచాలని ఆదేశించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: