ప్రపంచంలో రోజు రోజుకీ మానవత్వం పూర్తిగా నశించి పోతుంది..ముఖ్యంగా కొంత మగాళ్లు  వాయు వరుసలు..చిన్నా పెద్దా అని చూడకుండా కామంతో రెచ్చిపోతున్నారు. ఇలాంటి వారిని ప్రభుత్వాలు ఎంత కఠినంగా శిక్షలు విధించినా..కొత్తగా పుట్టుకొస్తునే ఉన్నారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం ఒక్క గురువుకే ఉంటుంది..కానీ ఆ గురువు కామంతో రెచ్చిపోయి నగ్నంగా తయారు అయ్యి.. విద్యార్ధిని పై పట్టపగలే రేప్ కి ప్రయత్నం చేసాడు. ఇంతలో అక్కడ ఉన్న విద్యార్థులు అతన్ని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు.

 వివరాలలోకి వెళితే.. చైనాలోని పాఠాలు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు కామంతో రెచ్చిపోయాడు.. పట్టపగలే నగ్నంగా తయారు అయ్యాడు. అంతేకాక విద్యార్ధినిపై  అత్యాచారానికి ప్రయత్నించాడు. చైనా లోని లింగ్షాన్ కౌంటీ లోని ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది..అయితే గతంలో ఆ ఉపాధ్యాయుడికి మతి స్థిమితం సరిగా లేకపోవడంతో చికిత్స తీసుకున్నాడని తర్వాత పూర్తిగా కోలుకోకుండానే నిడులలో చేరాడని పబ్లిక్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. గత 5 ఏళ్లుగా అతన్ని పాఠాలు చెప్పడానికి అనుమతులు ఇవ్వడంలేదని.. అయినా అతడు విధులు నిర్వహిస్తున్నాడని చెబుతున్నారు.

విద్యార్థినిపై అత్యాచార యత్నం చేస్తున్న టీచర్


అయితే ఇప్పటి వరకు ఎవరికీ ఎలాంటి హానీ చేయకున్నా ఒక్కసారే ఉన్మాదిగా మారిపోయి అందరూ చూస్తుండగానే బట్టలు విప్పేసి నగ్నంగా తయారై విద్యార్థిని పై అత్యాచారం చేయడానికి పూనుకున్నట్లు అక్కడ ఉన్న విద్యార్థులు తెలిపారు. ఈ విషయాన్ని పబ్లిక్ డిపార్ట్‌మెంట్ కుడా దీనిని నిర్దారణ చేసింది.  ఇక ఈ ఘటన తరువాత అతడి కుటుంబసభ్యులు అతడిని మరో మారు ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థినికి ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: