తెలుగు సినిమాల్లో తొంభైవ దశకం నుంచి ఫ్యాక్షన్ తరహా చిత్రాలు విపరీతంగా వస్తున్నాయి..గతంలో ఫ్యాక్షన్ చిత్రాలు ఉన్ప్పటికీ పెద్దగా గుండాయిజం, బాంబులతో దాడులు లాంటి ఒల్లు ఝలదరించే సన్నివేశాలు ఉండేవి కావు. గత కొంత కాలం నుంచి ఫ్యాక్షన్ చిత్రాలు బాగా వస్తున్నాయి..ఇక ఇలాంటి సినిమాల్లో బాంబులు,వేట కొడవళ్లు,రక్తపాతాలు కామన్ అయ్యాయి. రాయలసీమ అంటేనే రౌడీయిజం,గుండాయిజం, ఫ్యాక్షనీజం పగలు ప్రతీకారాలు అంటూ ఒక రకమైన సీన్ క్రియేట్ చేసింది టాలీవుడ్.

అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సినిమాల్లో రాయలసీమ వారిని విలన్లుగా చూపించడాన్ని శ్రీకాంత్ రెడ్డి తప్పుబట్టారు. మాట మాట్లాడితే రాయలసీమ గూండాలు అంటూ సినిమాల్లో చిత్రీకరించడంపై సీరియస్ అయ్యారు. నలుగురికి అన్నం పెట్టే గుణం సీమ ప్రజలదని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. తమ దగ్గర లేకపోయిన అప్పు తెచ్చి పెట్టేటువంటి గుణం సీమ ప్రజలదని ఆయన తెలిపారు. ప్రతీ విషయంలో సీమ ప్రజలను కించపరుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సమరసింహారెడ్డి ఫ్యాక్షన్ చిత్రం


ఇకపై సినిమాల్లో రాయలసీమ వారిని గూండాలుగా చిత్రీకరిస్తే మన నుంచే (అసెంబ్లీ) నోటీసులు పంపాలి. ఈ తరహా చిత్రీకరణలకు ముగింపు పలకాలి’ అని శ్రీకాంత్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా  హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణను ఫ్యాక్షన్ తరహా చిత్రాల్లో సీన సంస్కృతి కించపరిచే విధంగా చేయవద్దని శ్రీకాంత్ రెడ్డి  కోరారు. దానికి బాలకృష్ణ సానుకూలంగా స్పందించారు. శాసనసభ్యునిగా, సినీరంగానికి చెందినవాడిగా ఈ ప్రతిపాదనను పరిశీలిస్తానని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: